Garuda Panchami Vratham Telugu - Summary
గరుడ పంచమి తల్లి మరియు పిల్లలు ఒకరినొకరు ఆరాధించడం, అభిమానం, నిబద్ధత మరియు బంధాన్ని జరుపుకుంటారు. తల్లి పట్ల ఉన్న ప్రేమ మరియు నిబద్ధతను గుర్తించడానికి, ఈ పండుగ గరుడుడిపై అంకితం చేయబడింది. గరుడ పంచమి పూజను, ముఖ్యంగా మహిళలు, తమ పిల్లల అభిరుచి, శ్రేయస్సు మరియు భవిష్యత్తు కోసం చేసేటప్పుడు, ఆశలు మరియు కోర్కెలతో కూడుకున్నది. ఇటీవల వివాహమైన జంటలు ఈ పూజను తమ దాంపత్య జీవితాన్ని మెరుగుపర్చడానికి మరియు సంపన్న జీవితం కోసం నిర్వహిస్తారు.
గరుడ పంచమి పూజా విధానం
Garuda Panchami, as per our tradition, is celebrated by all ladies, whether married or single. Ladies visit the insect hill to perform pooja to Naga. Rice kolkattai (a sweet along with dhal one) is prepared as naivaidhyam. The mud from the insect hill is brought back home. After that, brothers are invited to sit on the rangoli, where sisters offer pooja to them.
Garuda Panchami Vratham in Telugu
ప్రతి ఏడాదీ తిరుమళలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు “గరుడంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.
స్త్రీలు కోరుకునే ప్రధాన వరం … సంతానం. మంచి సంతానంతో కూడిన మాతృత్వాన్ని ప్రతి స్త్రీ ఆశిస్తోంది. తన పిల్లలు పరాక్రమవంతులై విజయం సాధించాలని గ్రామంలో ఒక్కో తల్లి కోరుకుంటుంది. అలాంటి మహిళలకు అవసరమైన ఉత్తమమైన వ్రతమే ‘గరుడ పంచమి వ్రతం’. అన్నదమ్ములున్న యువతులు మాత్రమే ‘శ్రావణ శుక్ల పంచమి’ తిథిలో ఈ వ్రతం చేయవలసి ఉంటుంది.
ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై ముగ్గులు వేసి కొత్త వస్త్రాన్ని పరకులించి బియ్యం చల్లి, గరుత్మంతుడి ప్రతిమను ఉంచి షోడశోపచార పూజను నిర్వహించాలి. ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనాలను సమర్పించాలి. చేతిలో పది ముడులు గల తోరమును కట్టుకుని బ్రాహ్మణ సంతర్పణ చేయాలి. వారికి వాయనదానాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి.
ఇక ఈ వ్రతం వెనుక మనకు … తనతల్లి కోసం ప్రాణాలే దాటించిన గరుత్మంతుడి కథ ఉంది. పూర్వం కశ్యప ప్రజాపతికి ‘వినత – కద్రువ’ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకు పరాక్రమవంతుడైన వైనతేయుడు (గరుత్మంతుడు) జన్మించగా, కద్రువకు పాములు జన్మించాయి. ఓసారి కద్రువ వినతతో పందెం కాసి దుర్మార్గంగా ఆమెను గెలిచి, తన దాసిగా నియమించుకున్నది.
దేవలోకం నుంచి అమృతాన్ని తెచ్చి సవతి తల్లితో ఇస్తేనే తన తల్లి దాస్య విముక్తి పొందుతుందని తెలుసుకున్న గరుత్మంతుడు, వెంటనే అందుకు సిద్ధమయ్యారు. దేవలోకం వెళ్లి ఇంద్రాదిత్య దేవతలను ఎదుర్కొని అమృతాన్ని తెచ్చి తన సవతి తల్లికి అందించారు. అలా ఆయన తన తల్లికి దాస్య విముక్తిని కలిగించారు.
తల్లి పట్ల అనురాగాన్ని కనబరిచిన గరుత్మంతుడిని విష్ణుమూర్తి అభినందించి, తన వాహనంగా చేసుకున్నాడు. ఈ శ్రావణ శుక్ల పంచమి రోజున గరుత్మంతుడిని ఆరాధించిన వారికి పరాక్రమవంతమైన పిల్లలు కలుగుతారనీ, సకల శుభాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
You can download the Garuda Panchami Vratham Telugu PDF using the link given below.