Ratha Saptami Puja and Katha Telugu PDF

Ratha Saptami Puja and Katha in Telugu PDF download free from the direct link below.

Ratha Saptami Puja and Katha - Summary

Hindus Magha Saptami clean on rathasaptami festival is celebrated. Capricorn festival is celebrated today in South India. The seventh month of the lunar month is more special than the seventh day of the month.

Rath Saptaminadu It is auspicious to worship with cow dung. On the day of Rathsaptami, where the sun shines, on the eastern side, next to the Tulsikota, cow dung is sprinkled on it, a padma is put on it with flour, nuts are put in the oven, milk is poured and fresh rice, jaggery, ghee and cardamom are added to the milk to make paramannam. In front of the Tulsikota, a chariot with pulses is placed and offerings are made to the gods by placing paramannam on the pulses. On Rathsaptami, it is advisable to worship the deity with red flowers. All good luck if you donate to Chimmili.

Ratha Saptami Katha in Telugu

​సూర్య పూజ..

ఉదయం బ్రహ్మ స్వరూపంగానూ, మధ్యాహ్నం మహేశ్వరునిగానూ, సాయంకాలం విష్ణు రూపంగానూ ప్రతి దినం త్రిమూర్తి రూపంలో సూర్యభగవానుడు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. మాఘశుద్ధ సప్తమి అయిన రథసప్తమిని సూర్యజయంతిగా వేదాలు, ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రాతః కాలంలో మేల్కొని శిరస్సు, భుజాలపై జిల్లేడు ఆకులను ఉంచుకొని “సప్తసప్త మహాసప్త, సప్త ద్వీప వసుంధరా, సప్తార్క రమాధార సప్తమీ రథసప్తమీ” శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి.

​ఆరోగ్య ప్రధాత..

జిల్లేడు ఆకులు సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనవి. వీటినే అర్కపత్రాలని కూడా అంటారు. అలాగే గోవు పవిత్రమైంది కాబట్టి సంక్రాంతి మూడు రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలపైన గోక్షీరంతో చేసిన నైవేద్యాన్ని సూర్యభగ వానునికి సమర్పిస్తారు. ఫలితంగా ఆయన సంతృప్తి చెందుతాడని విశ్వసిస్తారు. రథసప్తమి శిశిర రుతువులో వస్తుంది. శిశిరానికి ముందు హేమంత రుతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మాఘ శుక్ల సప్తమి నుంచి సూర్యకిరణాల తీవ్రత పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే చర్మవ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని శాస్తజ్ఞ్రులు కూడా నిరూపించారు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌’ అంటే ఆరోగ్యం సూర్యుని ఆధీనం, ఆయన ఆరోగ్య ప్రదాతని అర్థం. సూర్యారాధనతో ఆరోగ్యం, తేజస్సు, బలం చేకూరుతాయని సామవేదం పేర్కొంటుంది.

జ్ఞానసిద్ధి కలుగుతుంది..

సూర్యుడుని పూజించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణయజుర్వేదం కూడా వివరిస్తుంది. ఆదిత్య రూపంలో వాతపిత్త రోగాల్ని, సవితృ రూపంలో సర్వశస్త్ర బాధల్ని, పూష్ణరూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. సూర్య నమస్కారాల గురించి పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. వీటిని బ్రహ్మ ముహుర్తం అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితం ఉంటుదట.

​శ్రీరాముడు కూడా సూర్యుడిని కొలిచాడు..

రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పఠించి, సూర్య నమస్కారాలు చేయడం వల్లే విజయం సాధించాడనేది జగద్విదితం. ఓం మిత్రాయనమః ఓం రవయేనమః, ఓం సూర్యాయనమః, ఓం భానువేనమః, ఓం ఖగాయనమః, ఓం పూష్ణేనమః, ఓం హిరణ్య గర్భాయనమః, ఓం మరీచయేనమః, ఓం ఆదిత్యాయనమః, ఓం సవిత్రేనమః, ఓం అర్కాయనమః, ఓం భాస్కరాయనమః అనే మంత్రాలతో 12 భంగిమల్లో సూర్యనమస్కారాలు చేయాలి. ఫలితంగా శరీరంలోని 600 కండరాల్లో కదిలిక ఏర్పడి శక్తి లభిస్తుంది.

​సూర్యుడి గురించి పురాణగాధ..

సూర్యుడు ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కుష్టువ్యాధి భారిన పడినప్పుడు 12 శ్లోకాలతో సూర్యున్ని ఆరాధించడంతో అతడి వ్యాధి నయమైందట. అలాగే ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే రాజు సూర్యభగవానుని ఆరాధించి శమంతకమణిని వరంగా పొందాడు.అనారోగ్యంతో బాధపడేవారు అరుణపారాయణం చేసినా, అరుణహోమం చేయించినా, అరసవెల్లి సూర్య నారాయణ స్వామిని దర్శించినా, కర్నూలు జిల్లా నంధ్యాలకు సమీపంలోని సూర్యనందీశ్వరస్వామిని రథసప్తమి రోజున దర్శించినా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట. కాబట్టి ఆరోగ్య ప్రధాత ఐశ్వర్య ధాత, అందరికీ ఆదర్శ మూర్తి అయిన ఆ ఉదయభానుడిని భక్తితో పూజించాలి. రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటాడు. చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే. సూర్యో దయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తిచేసిన ప్రియశిష్యుడు ఆంజనేయుడు.

​వివిధ ఆలయాల్లో ఊరేగింపు..

మహా విష్ణువుకు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయంలో సూర్యమండల, సూర్యదేవర ఊరేంగింపులు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా మంగళూరు వీర వెంకటేశ్వరస్వామి మందిరంలో రథోత్సవం ఎంతో వైభవంగా జరిపిస్తారు. తిరుపతిలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్తవాహనాలపై ఊరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమ, చక్రాసన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనాందంగా విహరిస్తారు. ఏడకొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు. అలాగే ఉత్సాహానికి, ఉల్లాసానికి, ఆనందానికి, కష్టానికి, కృషికి సమయపాలనకు ఆ ప్రత్యక్ష నారాయణుని ఆదర్శంగా తీసుకోవాలి. 33 కోట్ల దేవతలు ఉన్నారో లేదో తెలియదు కానీ, అడగకుండానే దర్శనం ఇచ్చే సాక్షీభూతుడు సూర్యభగవానుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన విధిని సక్రమంగా నెరవేర్చేవాడు సూర్యభగవానుడే. సంబంధిత.

You can download the Ratha Saptami Puja and Katha in PDF format using the link given below.

RELATED PDF FILES

Ratha Saptami Puja and Katha Telugu PDF Download