Vinayaka Vratha Kalpam (వినాయక చవితి వ్రతం) Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Ganapathi Vratha Katha (వినాయక చవితి వ్రతం) Telugu

The festival of ‘Vinayaka Chaviti’ is celebrated by the Hindus on the day of ‘Bhadrapada Shuddha Chaviti’ on the day of Vinayaka’s birth. There are many legends that Ganesha was born on that day and became a dictator. Vinayaka Chaviti should get up early in the morning and clean the house.

At this festival, people get fast to impress lord Ganesha. On this auspicious vratha devotees buy a Ganesha mud idol and decorate it to celebrate the festival. The puja should be started by lighting incense sticks and chanting the following mantra after Diparadhana.

Vinayaka Vratha Kalpam Telugu

శ్లోకం: ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

వినాయక వ్రత కథ (Vinayaka Vratha Katha Telugu) (Ganapathi Vratha Katha in Telugu)

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.

అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది.

కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,
వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. ధూపమాఘ్రాపయామి
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.. దీపందర్శయామి।

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.. నైవేద్యం సమర్పయామి.

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక.. సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం.. తాంబూలం సమర్పయామి.

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ.. నీరాజనం సమర్పయామి.

అథ దూర్వాయుగ్మ పూజా.. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి.

You can download the Vinayaka Vratha Kalpam Telugu PDF using the link given below.

Also Check – Vinayaka Chavithi Pooja Vidhanam Telugu PDF

2nd Page of Vinayaka Vratha Kalpam (వినాయక చవితి వ్రతం) PDF
Vinayaka Vratha Kalpam (వినాయక చవితి వ్రతం)
PDF's Related to Vinayaka Vratha Kalpam (వినాయక చవితి వ్రతం)

Vinayaka Vratha Kalpam (వినాయక చవితి వ్రతం) PDF Free Download

REPORT THISIf the purchase / download link of Vinayaka Vratha Kalpam (వినాయక చవితి వ్రతం) PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES