Lalitha Chalisa Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

శ్రీ లలితా చాలీసా

The Lalitha Chalisa (40-verse) is a prayer addressed to Sri Lalitha Tripura Sundari Devi, asking for her grace. The many virtues and accomplishments of Sri Lalitha Devi are exalted in this prayer.

The hymn “Lalita Chalisa” is a prayer to the Hindu deity Lalita Tripurasundari, also referred to as “Goddess Lalita.” She is viewed as one of the manifestations of the Divine Mother, standing for elegance, beauty, and divine femininity. The Lalita Chalisa is a collection of forty lines that invoke the blessings of Goddess Lalita and laud her.

Lalitha Chalisa Lyrics in Telugu (శ్రీ లలితా చాలీసా)

లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || 1 ||

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || 2 ||

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || 3 ||

శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || 4 ||

నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || 5 ||

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు || 6 ||

శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా || 7 ||

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి || 8 ||

పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి || 9 ||

రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు || 10 ||

కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి || 11 ||

రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగ
రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు || 12 ||

ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా || 13 ||

మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే || 14 ||

అర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా || 15 ||

విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి || 16 ||

ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ || 17 ||

దక్షుని ఇంట జనియించి సతీదేవిగ చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ || 18 ||

శంఖు చక్రమును ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు || 19 ||

పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరయించితివి || 20 ||

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే || 21 ||

సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి || 22 ||

మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ || 23 ||

సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి || 24 ||

మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి || 25 ||

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే || 26 ||

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం || 27 ||

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా || 28 ||

నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు || 29 ||

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి || 30 ||

అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి || 31 ||

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి || 32 ||

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి || 33 ||

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా || 34 ||

ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు || 35 ||

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి || 36 ||

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా || 37 ||

ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము || 38 ||

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు || 39 ||

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము || 40 ||

ఇతి శ్రీ లలితా చాలీసా సంపూర్ణం ||

You can download the (శ్రీ లలితా చాలీసా) Lalitha Chalisa PDF using the link given below.

2nd Page of Lalitha Chalisa Telugu PDF
Lalitha Chalisa Telugu
RELATED PDF FILES

Lalitha Chalisa Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of Lalitha Chalisa Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES