Sri Rama Dandakam Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Sri Rama Dandakam Telugu

శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. ‘లవకుశ’ తెలుగు-తమిళ వెర్షన్లు, ‘సంపూర్ణ రామాయణం’ తమిళ వెర్షన్, ‘శ్రీకృష్ణ సత్య’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’.. ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, ‘అడవి రాముడు’, ‘చరణదాసి’, ‘చిట్టి చెల్లెలు’, ‘తిక్క శంకరయ్య’ మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.

నేడు (మే 28) ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ శ్రీరామ దండకం ఆలపించారు. క్లిష్టమైన, గ్రాంధిక పదాలు, వత్తులతో పలకడానికి కష్టమైన దండకాన్ని బాలకృష్ణ అవలీలగా ఆలపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ శ్రీ రామ దండకాన్ని విడుదల చేశారు. ఈ శ్రీరామ దండకం నిడివి: 3.15 నిమిషాలు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు.

Srirama Dandakam Telugu – శ్రీరామ దండకం

శ్రీరామ రామా, త్రిలోకాభి రామా, పరంధామ, నిష్కామ సంపూర్ణ కామా, బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా, లసద్దివ్య నామా, విరాజద్గురు స్తోమ, యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం, అచింత్యం, అనంతం, అసంగం, అఖండం అబాధ్యం, అబోధ్యం, అభేద్యం, అవిచ్చేద్యం, ఆద్యంత శూన్యం, ఆజం, అప్రమేయం, అవిజ్నేయం, అధ్యేయం, అద్వంద్వం, అవ్యక్తం, అగ్రాహ్యం, ఆధ్యాత్మ మేకం, అరూపం, అనాఖ్యం, అరక్తం, ఆశుక్లం, అ కృష్ణం, అపేతం, అపీనం, అ సూక్ష్మం, అదీర్ఘం, ఆహ్రస్వం, అబాహ్యాంతరం, అక్షరం, అవ్యయం, ఇంద్రియా గోచరం, అప్రతర్క్యం, అనిర్దేశ్యం, ఆద్యం, అద్రుశం, అకంపం, అలక్ష్యం, అలిప్తం, ఆశబ్దం, అసంస్పర్శ భూతం, అరూపం, అసుస్వాదు గంధం, అవాన్మానస ప్రాప్యమై, పూర్ణ మై, నిత్యమై, సత్యమై, శుద్ధ మై, బుద్ధ మై, ముక్త మై, శాంతమై, కేవలంబై, నిరాకారమై, సచ్చి దానంద రూపాత్మ చైతన్యమై, సర్వ భూతోరు దేహెంద్రియ ప్రాణ హృద్బుద్ధ్య హంకార, చిత్తాది, దృశ్య ప్రపంచంబు, నాదిత్యుడీ విశ్వ మెల్లన్, వెలింగిమ్పగా, జేయు రీతిన్, ప్రకాశింపగా జేయగా, సాక్షి వై, యాకసం బేకమై, సర్వ భాండంబు లందు అంతట న్, లోపలన్ , వెల్పలన్ నిండి యున్నట్టుల్ ఆకాశ వాయ్వగ్ని వార్భూమి, నానా విధా శేష భూతం బు లందు అంతట న్, నిర్వి లిప్తున్దవై యుండి, కర్తృత్వ, భోత్క్రుత్వ, మంత్రత్వ, భర్త్రుత్వ, హర్త్రుత్వ ముల్, నామ రూప క్రియో పాది వర్నాశ్రమంబు లు గుణమ్బుల్ , వివేకా వివేకంబుల్, శోక మొహమ్బులన్, లేక, ఈ స్థూల శూక్ష్మాదులన్, జాగర స్వప్న సుప్త్యాదుల్, పంచ భూతంబులన్, పంచ కోశంబులన్ ,చూచుచున్, నిర్వి కారున్డవై, నిర్వి కల్పున్డవై, నిర్వి చేష్టున్దవై, నిష్ప్రపంచుండ వై, నిర్వి శేషున్డవై, నిర్గుణ బ్రహ్మ మాత్రున్డవై, యొప్పు, నీ దివ్య తత్వంబు, నీ సత్క్రుపా, సంభ్రుతాంచాట్ కటాక్షంబు చేతం గనున్గొంటి దేవా, నమస్తే, నమస్తే, నమస్తే నమః.

You can download the Sri Rama Dandakam Telugu PDF using the link given below.

Sri Rama Dandakam Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of Sri Rama Dandakam Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES