Sri Rama Pattabhishekam Sarga Telugu

Sri Rama Pattabhishekam Sarga Telugu PDF download free from the direct link given below in the page.

1 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Sri Rama Pattabhishekam Sarga Telugu PDF

ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునందు మొదటిసర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి.

Sri Rama Pattabhishekam Sarga Telugu PDF can be downloaded free from the link given at the bottom of this page.

Sri Rama Pattabhishekam Sarga in Telugu (శ్రీరామ పట్టాభిషేకం)

శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః |
బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమమ్ || ౧

అర్థం – శిరస్సుపైన తన చేతులతో అంజలి ఘటించి, కైకేయీ ఆనంద వర్ధనుడైన భరతుడు, తన పెద్ద అన్నగారు, సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికెను.

పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ |
తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ || ౨

అర్థం – “పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరల మీకు తిరిగి ఇస్తున్నాను.”

ధురమేకాకినా న్యస్తామృషభేణ బలీయసా |
కిశోరవద్గురుం భారం న వోఢుమహముత్సహే || ౩

అర్థం – బలమైన ఎద్దువలె మోయదగిన ఈ బరువును (రాజ్యభారము) లేగదూడ వలె ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను.

వారివేగేన మహతా భిన్నః సేతురివ క్షరన్ |
దుర్బంధనమిదం మన్యే రాజ్యచ్ఛిద్రమసంవృతమ్ || ౪

అర్థం – నదీవేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలె, ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుచున్నది.

గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేవ చ వాయసః |
నాన్వేతుముత్సహే రామ తవ మార్గమరిందమ || ౫

అర్థం – గుర్రములయొక్క గతిని ఒక గాడిద, హంసలయొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా, నేను మీ మార్గమును అందుకొనలేక పోవుచున్నాను, ఓ శత్రునాశకా !

యథా చారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే |
మహాంశ్చ సుదురారోహో మహాస్కంధః ప్రశాఖవాన్ || ౬

అర్థం – యెటులైతే ఇంటి పెరటిలో నాటి, పెంచబడిన వృక్షము పెద్దదై, భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడక..

శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ |
తస్య నానుభవేదర్థం యస్య హేతోః స రోప్యతే || ౭

అర్థం – .. పుష్పములు కలిగన తరువాత, ఫలములు కలుగక ఎండిపోవునో, అటువంటి చెట్టు, నాటిన వాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు …

ఏషోపమా మహాబాహో త్వదర్థం వేత్తుమర్హసి |
యద్యస్మాన్మనుజేంద్ర త్వం భక్తాన్భృత్యాన్న శాధి హి || ౮

అర్థం – ..ఈ ఉపమానము, (గొప్ప భుజములు కల) ఓ మహాబాహో ! మీ దాసులగు మమ్ములను రాజువలె పరిపాలింపని మీకు అర్థము కాగలదు.

జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః |
ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసమ్ || ౯

అర్థం – జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే, అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను.

తూర్యసంఘాతనిర్ఘోషైః కాంచీనూపురనిస్వనైః |
మధురైర్గీతశబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ || ౧౦

అర్థం – సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంతవరకు మీరు విశ్రాంతి తీసుకొనుము.

యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా |
తావత్త్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ || ౧౧

అర్థం – “ఎప్పటివరకు జ్యోతిశ్చక్రము (ఖగోళము) ఉండునో, ఎప్పటివరకు వసుంధర (భూమి) ఉండునో, అప్పటివరకు ఈ లోకమున మీ స్వామిత్వమును (పరిపాలనను) మేము అనుసరించెదము.”

భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః |
తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే || ౧౨

అర్థం – భరతుని వచనములు విన్న పరపురంజయుడైన (పరుల పురమును జయించిన) రాముడు, అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను.

తతః శత్రుఘ్నవచనాన్నిపుణాః శ్మశ్రువర్ధకాః |
సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత || ౧౩

అర్థం – తరువాత, శత్రుఘ్నుని సూచనమేరకు, నైపుణ్యము కలిగి, తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు, రాఘవుని వద్దకు వచ్చిరి.

పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే |
సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే || ౧౪

అర్థం – ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు, స్నానము చేసెను.

విశోధితజటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః |
మహార్హవసనో రామస్తస్థౌ తత్ర శ్రియా జ్వలన్ || ౧౫

అర్థము – చిక్కులువిడదీయబడిన జటలతో స్నానముచేసి, అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయబడి, శ్రేష్ఠమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను.

ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ |
లక్ష్మణస్య చ లక్ష్మీవానిక్ష్వాకుకులవర్ధనః || ౧౬

అర్థం – రామునియొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుడు (శతృఘ్నుడు) లక్ష్మణునికి కూడా చేయసాగెను.

ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః |
ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరమ్ || ౧౭

అర్థం – సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు (దశరథ భార్యలు) తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి.

తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనమ్ |
చకార యత్నాత్కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా || ౧౮

అర్థం – తరువాత వానరపత్నులందరకును, పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాముగా అలంకారము చేసెను.

తతః శత్రుఘ్నవచనాత్సుమంత్రో నామ సారథిః |
యోజయిత్వాఽభిచక్రామ రథం సర్వాంగశోభనమ్ || ౧౯

అర్థం – తరువాత, శత్రుఘ్నుని ఆదేశముమేర సుమంత్రుడు అను పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను.

అర్కమండలసంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమమ్ |
ఆరురోహ మహాబాహూ రామః సత్యపరాక్రమః || ౨౦

అర్థం – సూర్యమండలము వంటి శోభకలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు, సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను.

సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్రసదృశద్యుతీ |
స్నాతౌ దివ్యనిభైర్వస్త్రైర్జగ్మతుః శుభకుండలౌ || ౨౧

అర్థం – సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభకలవారై, స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని, శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి.

వరాభరణసంపన్నా యయుస్తాః శుభకుండలాః |
సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః || ౨౨

అర్థం – గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవపత్ని మరియు సీతా, నగరము చూచుటకు ఉత్సాహముగా యుండిరి.

అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్య యే |
పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్థవత్ || ౨౩

అర్థం – అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు, పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి.

అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః |
మంత్రయన్రామవృద్ధ్యర్థమృద్ధ్యర్థం నగరస్య చ || ౨౪

అర్థం – అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి, రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి.

సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః |
కర్తుమర్హథ రామస్య యద్యన్మంగళపూర్వకమ్ || ౨౫

అర్థం – “మహాత్ముడైన రాముని పట్టభిషేకము కొరకు విజయసూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి.”

ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్య తు పురోహితమ్ |
నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శనబుద్ధయః || ౨౬

అర్థం – అని ఆ మంత్రులకు, అందరు పురోహితులకు తగు సూచనలు చేసి, శ్రీరామ దర్శనముకొరకు నగరము నుండి బయలుదేరిరి.

హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానఘః |
ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమమ్ || ౨౭

అర్థం – ఉత్తమైన రథమునందు, వేయికనుల వానివలె (ఇంద్రుడు) కళంకరహితుడగు రాముడు స్వారీ చేయసాగెను.

జగ్రాహ భరతో రశ్మీఞ్శత్రుఘ్నశ్ఛత్రమాదదే |
లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యవీజయత్ || ౨౮

అర్థం – భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును (గొడుగు) పట్టుకొనెను. లక్ష్మణుడు వ్యజనమును (విసినకర్ర) పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను.

శ్వేతం చ వాలవ్యజనం జగ్రాహ పురతః స్థితః |
అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః || ౨౯

అర్థం – తెలుపు రంగు వాలవ్యజనమును (చామరమును) ముందువైపున, చంద్రప్రభ కలిగిన రాక్షసరాజగు విభీషణుడు పట్టుకొనెను.

ఋషిసంఘైస్తదాఽఽకాశే దేవైశ్చ సమరుద్గణైః |
స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః || ౩౦

అర్థం – అప్పుడు ఆకాశమునందు ఋషిసమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి.

తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమమ్ |
ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః || ౩౧

అర్థం – అప్పుడు, శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుడు, వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను.

నవనాగసహస్రాణి యయురాస్థాయ వానరాః |
మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః || ౩౨

అర్థం – తొమ్మిది వేల ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్యరూపమున సర్వాభరణములతో అగుపించిరి.

శంఖశబ్దప్రణాదైశ్చ దుందుభీనాం చ నిస్స్వనైః |
ప్రయయౌ పురుషవ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీమ్ || ౩౩

అర్థం – శంఖము యొక్క శబ్దము మరియు దుందుభీ (ఢంకా) యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా, పురుషవ్యాఘ్రము (పురుషులలో పులివంటివాడు) భవనముల మాలలు కలిగిన (అయోధ్య) పురమునందు వెడలసాగెను.

దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరమ్ |
విరాజమానం వపుషా రథేనాతిరథం తదా || ౩౪

అర్థం – ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో, అతిరథుని (గొప్ప యోధుని) వలె కనిపించెను.

తే వర్ధయిత్వా కాకుత్స్థం రామేణ ప్రతినందితాః |
అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితమ్ || ౩౫

అర్థం – తనకు జేజేలు పలుకు వారిని కాకుత్స్థుడు (రాముడు) తిరిగి పలకరింపగా, వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి.

అమాత్యైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః |
శ్రియా విరురుచే రామో నక్షత్రైరివ చంద్రమాః || ౩౬

అర్థం – మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడగు రాముడు, నక్షత్రముల మధ్య చంద్రునివలె శోభించెను.

స పురోగామిభిస్తూర్యైస్తాలస్వస్తికపాణిభిః |
ప్రవ్యాహరద్భిర్ముదితైర్మంగళాని యయౌ వృతః || ౩౭

అర్థం – ముందువైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్యపరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము, మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను.

అక్షతం జాతరూపం చ గావః కన్యాస్తథా ద్విజాః |
నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః || ౩౮

అర్థం – బంగారువర్ణము గల అక్షతలతో (బియ్యపుగింజలు), గోవులతో, కన్యలతో, ద్విజులతో (బ్రాహ్మణులు) వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపిపదార్థములు పట్టుకుని రాముని ముందువైపు వెళ్ళసాగారు.

సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే |
వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలమ్ |
విభీషణస్య సంయోగమాచచక్షే చ మంత్రిణామ్ || ౩౯

అర్థం – రాముడు, సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్మజుని (హనుమంతుని) బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణుతో జరిగిన సమావేశమును, మంత్రులకు వర్ణించసాగెను.

శ్రుత్వా తు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః || ౪౦

అర్థం – ఇది వినిన అయోధ్యా పురవాసులు విస్మయము (ఆశ్చర్యము) చెందిరి.

ద్యుతిమానేతదాఖ్యాయ రామో వానరసంవృతః |
హృష్టపుష్టజనాకీర్ణామయోధ్యాం ప్రవివేశ హ || ౪౧

అర్థం – ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుతూ, వానరములతో కలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను.

తతో హ్యభ్యుచ్ఛ్రయన్పౌరాః పతాకాస్తే గృహే గృహే || ౪౨

అర్థం – తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి.

ఐక్ష్వాకాధ్యుషితం రమ్యమాససాద పితుర్గృహమ్ || ౪౩

అర్థం – రమ్యము, ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రిగృహమునకు (రాముడు) చేరెను.

అథాబ్రవీద్రాజసుతో భరతం ధర్మిణాం వరమ్ |
అర్థోపహితయా వాచా మధురం రఘునందనః || ౪౪

అర్థం – తరువాత ఆ రాజపుత్రుడగు రఘునందనుడు (రాముడు), ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలకసాగెను.

పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః |
కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ || ౪౫

అర్థం – పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు, కౌసల్యా, సుమిత్రా మరియు కైకేయీ లకు నమస్కరించెను. (తరువాత ఇటుల చెప్పసాగెను).

యచ్చ మద్భవనం శ్రేష్ఠం సాశోకవనికం మహత్ |
ముక్తావైడూర్యసంకీర్ణం సుగ్రీవాయ నివేదయ || ౪౬

అర్థం – “(భరతా!) నా ఈ భవనము శ్రేష్ఠమైనది, అశోకవనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడియున్నది. దీనిని సుగ్రీవునకు చూపుము” అనెను.

తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః |
పాణౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయమ్ || ౪౭

అర్థం – ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడగు భరతుడు, సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకువచ్చెను.

తతస్తైలప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ |
గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః || ౪౮

అర్థం – అప్పుడు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు (సహాయకులు) గృహములోకి వచ్చిరి.

ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః |
అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో || ౪౯

అర్థం – మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడు (భరతుడు) సుగ్రీవునితో “రాముని అభిషేకముకొరకు దూతలను పురమాయింపుము” అని అడిగెను.

సౌవర్ణాన్వానరేంద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్ |
దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్నవిభూషితాన్ || ౫౦

అర్థం – సువర్ణమయము, సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానరశ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. (తరువాత ఇట్లు పలికెను.)

యథా ప్రత్యూషసమయే చతుర్ణాం సాగరాంభసామ్ |
పూర్ణైర్ఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః || ౫౧

అర్థం – “రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి, నా ఆజ్ఞకోసము వేచియుండండి” అని పలికెను.

ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమాః |
ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః || ౫౨

అర్థం – మహాత్ముడగు వానరశ్రేష్ఠుడు ఇటుల చెప్పగనే, వారు గరుడునివలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి.

జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీ చ వానరః |
ఋషభశ్చైవ కలశాఞ్జలపూర్ణానథానయన్ || ౫౩

అర్థం – అటు తరువాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శీ మరియు ఋషభుడు అను వానరులు, నీరునింపబడిన కలశములతో వచ్చిరి.

నదీశతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ || ౫౪

అర్థం – అయిదువందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి.

పూర్వాత్సముద్రాత్కలశం జలపూర్ణమథానయత్ |
సుషేణః సత్త్వసంపన్నః సర్వరత్నవిభూషితమ్ || ౫౫

అర్థం – తూర్పుసముద్రము యొక్క నీటిచే నింపబడిన, రత్నమయమైన కలశమును సత్త్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను.

ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమాహరత్ |
రక్తచందనశాఖాభిః సంవృతం కాంచనం ఘటమ్ || ౫౬

అర్థం – ఋషభుడు త్వరగా దక్షిణసముద్రము యొక్క జలమును, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను.

గవయః పశ్చిమాత్తోయమాజహార మహార్ణవాత్ |
రత్నకుంభేన మహతా శీతం మారుతవిక్రమః || ౫౭

అర్థం – గవయుడు పశ్చిమమహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభము (కలశము) లో వాయువేగముగ తెచ్చెను.

ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడానిలవిక్రమః |
ఆజహార స ధర్మాత్మా నలః సర్వగుణాన్వితః || ౫౮

అర్థం – ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా, గరుడ మరియు వాయువిక్రమము గల ధర్మాత్ముడు, సర్వగుణసంపన్నుడు అయిన నలుడు తెచ్చెను.

తతస్తైర్వానరశ్రేష్ఠైరానీతం ప్రేక్ష్య తజ్జలమ్ |
అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ |
పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యవేదయత్ || ౫౯

అర్థం – అలా వానరశ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి, శత్రుఘ్నుడు తన మంత్రులతో కలసి, పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను.

తతః స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ |
రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ || ౬౦

అర్థం – అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠులవారు, తోటి బ్రాహ్మణులతో కలసి, రత్నమయ పీఠము పైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను.

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |
కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా || ౬౧

అర్థం – వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు ..

అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా |
సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా || ౬౨

అర్థం – .. నరవ్యాఘ్రమును (నరులలో పులివంటి రాముడికి) సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో, అష్టవసువులు సహస్రాక్షునికి (ఇంద్రునికి) చేసినట్లు, అభిషేకము చేసిరి.

ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా |
యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః || ౬౩

అర్థం – ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, ఆనందముగా యున్న పట్టణవాసులతో అభిషేకము చేయించితిరి.

సర్వౌషధిరసైర్దివ్యైర్దైవతైర్నభసి స్థితైః |
చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః || ౬౪

అర్థం – సర్వ ఔషధరసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి.

బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్ |
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్తతేజసమ్ || ౬౫

అర్థం – బ్రహ్మచే (సృష్టికి) పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది. దీనితో చాలా కాలము క్రితము మను కు పట్టాభిషేకము చేయుటవలన తేజస్సుచే దీప్తమైనది.

తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః |
సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః |
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః || ౬౬

అర్థం – ఆయన తరువాత ఉన్న రాజుల క్రమమునకు (పరంపరకు) దీనిచే పట్టాభిషేకము చేయబడినది. (ఇప్పుడు) సభయందు బంగారువర్ణపు శోభతో, మహాధనవంతమగునది, వివిధరత్నములచేత చిత్రముగా మంచిశోభను కలిగియున్నది.

నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి |
కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా |
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః || ౬౭

అర్థం – నానారత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వసిష్ఠులవారు (తన) తోటి ఋత్విక్కులతో కలసి మిగిలిన భూషణములతోపాటు రాఘవునకు అలంకారము చేసిరి.

ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభమ్ |
శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః |
అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః || ౬౮

అర్థం – శుభకరమైన ధవళ ఛత్రమును (గొడుగు) శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాలవ్యజనమును (చామరమును) వానరేశ్వరుడగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రునివలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజగు విభీషణుడు గొనెను.

మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్ |
రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః || ౬౯

అర్థం – నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుడు, వాసవుని (ఇంద్రుని) ప్రోత్సాహముతో ఇచ్చెను.

సర్వరత్నసమాయుక్తం మణిరత్నవిభూషితమ్ |
ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్రప్రచోదితః || ౭౦

అర్థం – సర్వరత్నములతో పొదగబడి, మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యములహారమును, ఆ రాజునకు, శక్రుని (ఇంద్రుని) ఆదేశము మేర (వాయుదేవుడు) ఇచ్చినాడు.

ప్రజగుర్దేవగంధర్వా ననృతుశ్చాప్సరోగణాః |
అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః || ౭౧

అర్థం – లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను.

భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః |
గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే || ౭౨

అర్థం – భూమి సస్యశ్యామలముగా, ఫలములుతో చెట్లు, మంచి సువాసనలతో పుష్పములు, రాఘవ ఉత్సవములో నిండినవి.

సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా |
దదౌ శతం వృషాన్పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః || ౭౩

అర్థం – నూరు సహస్రములగా అశ్వములను, ధేనువులను, గోవులను, నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజ శ్రేష్ఠుడు (రాముడు) ఇచ్చెను.

త్రింశత్కోటీర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః |
నానాభరణవస్త్రాణి మహార్హాణి చ రాఘవః || ౭౪

అర్థం – మూడువందలకోట్ల బంగారునాణెములు, నానావిధములైన, విలువైన, ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను.

అర్కరశ్మిప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహామ్ |
సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్మనుజర్షభః || ౭౫

అర్థం – సూర్యరశ్మివంటి ప్రభతో, బంగారముతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు (రాముడు) ఇచ్చెను.

వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్నవిభూషితే |
వాలిపుత్రాయ ధృతిమానంగదాయాంగదే దదౌ || ౭౬

అర్థం – వైడూర్యమణితో చిత్రితమై, వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును (కేయూరమును) వాలిపుత్రుడు, ధృతిమంతుడు అయిన అంగదునకు (రాముడు) ఇచ్చెను.

మణిప్రవరజుష్టం చ ముక్తాహారమనుత్తమమ్ |
సీతాయై ప్రదదౌ రామశ్చంద్రరశ్మిసమప్రభమ్ || ౭౭

అర్థం – శ్రేష్ఠములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో యున్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను.

అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ |
అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే || ౭౮

అర్థం – శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము యైన ఆభరణములను వైదేహీ వాయుసూనునకు (హనుమంతుడు) ఇవ్వజూచెను.

అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనకనందినీ |
అవైక్షత హరీన్సర్వాన్భర్తారం చ ముహుర్ముహుః || ౭౯

అర్థం – జనకనందిని (సీత) తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరల మరల చూడసాగిరి.

తామింగితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్ |
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని |
పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని సర్వశః || ౮౦

అర్థం – ఇంగితజ్ఞానము కల రాముడు, జనకాత్మజయగు సీతను చూచి ఇట్లనెను. “ప్రియమైన సీతా, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము.”

దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా |
హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః |
చంద్రాంశుచయగౌరేణ శ్వేతాభ్రేణ యథాఽచలః || ౮౧

అర్థం – ఆ హారమును అసితేక్షణా (నల్లటి కనులు కలిగిన సీత) వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా, చంద్రకాంతులతో, తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతమువలె అగుపించెను.

తతో ద్వివిదమైందాభ్యాం నీలాయ చ పరన్తపః |
సర్వాన్కామగుణాన్వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః || ౮౨

అర్థం – శత్రువులను హింసించునట్టి ద్వివిదునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు (రాముడు) బహుమతులు ఇచ్చెను.

సర్వవానరవృద్ధాశ్చ యే చాన్యే వానరేశ్వరాః |
వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః || ౮౩

అర్థం – సర్వవానరవృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి.

విభీషణోఽథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా |
సర్వవానరముఖ్యాశ్చ రామేణాక్లిష్టకర్మణా || ౮౪

అర్థం – విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానరవృద్ధులను రాముడికోసం విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని..

యథార్హం పూజితాః సర్వైః కామై రత్నైశ్చ పుష్కలైః |
ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యథాగతమ్ || ౮౫

అర్థం – .. వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా, వారు సంతోషమనస్కులై తిరిగి వెడలిరి.

నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః |
విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ || ౮౬

అర్థం – వందనము చేయుచూ ఆ మహాత్ములగు వానరోత్తములు, పార్థివేంద్రునచే (రామునిచే) వీడ్కోలు తెలుపబడి కిష్కింధకు వెడలిరి.

సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనమ్ |
పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీమ్ || ౮౭

అర్థం – వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి, రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను.

[రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజితః |]
విభీషణోఽపి ధర్మాత్మా సహ తైర్నైరృతర్షభైః |
లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః || ౮౮

అర్థం – ధర్మాత్ముడు, ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజగు విభీషణుడు, తన కులధనము (రాక్షస రాజ్యము మరియు పరివారము) తీసుకుని లంకకు మరలెను.

స రాజ్యమఖిలం శాసన్నిహతారిర్మహాయశాః |
రాఘవః పరమోదారః శశాస పరయా ముదా || ౮౯

అర్థం – అఖిల రాజ్యములు శాసించగల, శత్రువులను సంహరించిన, మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో, పరమ ఆనందముతో ..

ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః || ౯౦

అర్థం – .. ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడగు రాముడు ఇట్లనెను.

ఆతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం
గాం పూర్వరాజాధ్యుషితాం బలేన |
తుల్యం మయా త్వం పితృభిర్ధృతా యా
తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ || ౯౧

అర్థం – “ధర్మజ్ఞా (ధర్మము తెలిసినవాడా), నాతో పాటు ఈ భూమిని (రాజ్యమును) పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు, నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము.

సర్వాత్మనా పర్యనునీయమానో
యదా న సౌమిత్రిరుపైతి యోగమ్ |
నియుజ్యమానోఽపి చ యౌవరాజ్యే
తతోఽభ్యషించద్భరతం మహాత్మా || ౯౨

అర్థం – అన్నివిధముల బ్రతిమిలాడినగాని సౌమిత్రి (లక్ష్మణుడు) అంగీకారము తెలుపని కారణమున, యౌవరాజ్యాభిషేకమును మహాత్ముడు (రాముడు) భరతునకు చేసెను.

పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ |
అన్యైశ్చ వివిధైర్యజ్ఞైరయజత్పార్థివర్షభః || ౯౩

అర్థం – పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు (రాముడు) ఆచరించెను.

రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః |
శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్భూరిదక్షిణాన్ || ౯౪

అర్థం – రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధయజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతలకోసము సమర్పించెను.

ఆజానులంబబాహుః స మహాస్కంధః ప్రతాపవాన్ |
లక్ష్మణానుచరో రామః పృథివీమన్వపాలయత్ || ౯౫

అర్థం – జానువులవరకు ఉన్న పొడవైన మహా భుజములతో, ప్రతాపవంతుడై, లక్ష్మణుని తోడుగా, రాముడు పృథివిని పాలించెను.

రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమమ్ |
ఈజే బహువిధైర్యజ్ఞైః ససుహృజ్జ్ఞాతిబాంధవః || ౯౬

అర్థం – ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు, తన పుత్రులు, భ్రాతృలతో, బంధువులతో కలసి చేసెను.

న పర్యదేవన్విధవా న చ వ్యాలకృతం భయమ్ |
న వ్యాధిజం భయం వాఽపి రామే రాజ్యం ప్రశాసతి || ౯౭

అర్థం – వైధవ్య విషాదము, కౄరమృగముల భయము, వ్యాధి భయములు లేక రామ రాజ్యము కీర్తింపబడెను.

నిర్దస్యురభవల్లోకో నానర్థః కం‍చిదస్పృశత్ |
న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే || ౯౮

అర్థం – చోరత్వము లోకమునందు లేదు. జనుల యందు వ్యర్థభావము లేకుండె. వృద్ధులు బాలురపై ప్రేతకార్యములు చేయకుండిరి.

సర్వం ముదితమేవాసీత్సర్వో ధర్మపరోఽభవత్ |
రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్పరస్పరమ్ || ౯౯

అర్థం – అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించుకొనక యుండిరి.

ఆసన్వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః |
నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి || ౧౦౦

అర్థం – వేల వర్షముల (ఆయుర్దాయము) తో, వేలమంది పుత్రులతో, అనారోగ్యము లేక, శోకములేక రామునిచే రాజ్యము పాలింపబడెను.

రామో రామో రామ ఇతి ప్రజానామభవన్కథాః |
రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి || ౧౦౧

అర్థం – రామ, రామ, రామ అని రాముని గురించి, రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను.

నిత్యపుష్పా నిత్యఫలాస్తరవః స్కంధవిస్తృతాః |
కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః || ౧౦౨

అర్థం – నిత్యము పుష్పములు, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము (గాలి) సుఖస్పర్శతో వీచెను.

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా లోభవివర్జితాః |
స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః || ౧౦౩

అర్థం – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక, తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి.

ఆసన్ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః |
సర్వే లక్షణసంపన్నాః సర్వే ధర్మపరాయణాః || ౧౦౪

అర్థం – ప్రజలు ధర్మపరులై, అనృతములు (కఠినమైన మాటలు) అనక రామరాజ్యమున అందరు మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి.

దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ |
భ్రాతృభిః సహితః శ్రీమాన్రామో రాజ్యమకారయత్ || ౧౦౫

అర్థం – పదివేల పదివందల వర్షములు, తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేసెను.

Download Sri Rama Pattabhishekam Sarga Telugu PDF

REPORT THISIf the purchase / download link of Sri Rama Pattabhishekam Sarga Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • 108 Divya Desams List of Lord Vishnu

    Download the 108 Divya Desams of Lord Vishnu PDF using the link given below. A Divya Desam or Vaishnava Divya Desam is one of the 108 Vishnu temples that are mentioned in the works of the Alvars (saints). ”Divya” means “divine” and “Desam” indicates “place of abode” (temple). Out of...

  • 108 Nagaraja Ashtottara Shatanamavali Telugu

    भारत, नेपाल और अन्य देशों में जहाँ हिन्दू धर्म के अनुयायी रहते हैं वे सभी इस दिन पारंपरिक रूप से नाग देवता की पूजा करते है, और परिवार के कल्याण के लिए उनके आशीर्वाद की मांग की जाती है। శ్రీనాగరాజాష్టోత్తరశతనామావలిః నమస్కరోమి దేవేశ నాగేన్ద్ర హరభూషణ । అభీష్టదాయినే తుభ్యం అహిరాజ నమో నమః...

  • 108 Names of Sri Maha Lakshmi Devi

    Sl.No Name Meaning 1 Om Prakrityai Namah Nature 2 Om Vikrityai Namah Multi-Faceted Nature 3 Om Vidyaayai Namah Wisdom 4 Om Sarvabhutahitapradaayai Namah Granter of Universal Niceties 5 Om Shraddhaayai Namah Devoted 6 Om Vibhuutyai Namah Wealth 7 Om Surabhyai Namah Celestial Being 8 Om Paramaatmikaayai Namah Omnipresence 9 Om...

  • 12JyotirlingNameandPlaceList

    भारत में धार्मिक मान्यताओं और पवित्र मंदिरों से बसा देश है, जहां लोग ईश्वर की आराधना करते हैं। यहां कई सारे प्राचीन और पवित्र मंदिर हैं, इनमें भगवान भोलेनाथ के मंदिरों की महिला ही अपार है। इन्हीं पवित्र शिवालयों में भोलेनाथ के 12 प्रसिद्ध ज्योतिर्लिंग भी हैं। इन ज्योतिर्लिंगों का...

  • 2016 West Bengal Assembly Election Result

    A Legislative Assembly election was held in 2016 for the 294 seats (out of 295 seats) of the Vidhan Sabha in the state of West Bengal in India. The India Trinamool Congress under Mamata Banerjee won 211 seats, and thus was reelected with an enhanced majority. 2016 West Bengal Legislative...

  • 2022 Calendar with Indian Holidays

    A calendar is a system of organizing days. This is done by giving names to periods of time, typically days, weeks, months and years. A date is the designation of a single, specific day within such a system. A calendar is also a physical record (often paper) of such a...

  • 2023 Calendar Telugu

    2023 Telugu Calendar PDF showing Telugu festivals and holidays in Andhra Pradesh & Telangana. January corresponds to Pushyam and Magha Masam 2023 of the Telugu calendar. The users who are searching for the Telugu Calendar 2023 can download it here free of cost. The hard copy of this calendar is...

  • 2024 Calendar (മലയാളം കലണ്ടർ) Malayalam

    The 2024 Malayalam calendar PDF, with its fascinating blend of astrology and cultural traditions, is a window into the vibrant tapestry of Kerala’s heritage. From the grandeur of Thrissur Pooram to the beauty of Onam, the festivals celebrated throughout the year offer a glimpse into the soul of the Malayali...

  • 2Bhk Scheme 3rd Phase in Hyderabad List

    The 2BHK Scheme, short for the “Double-Bedroom Housing Scheme,” is a flagship program under the Pradhan Mantri Awas Yojana (PMAY) aimed at ensuring “Housing for All” by providing affordable housing to economically weaker sections and low-income groups. The primary objective of this scheme is to address the housing shortage in...

  • 36000 Primary Teachers Cancel List (36000 চাকরি বাতিল)

    The Kolkata High Court ordered to cancellation of 36000 primary teachers’ jobs in West Bengal in presents of Justice Abhijeet Ganguly. These all teachers were found non-trained. These all were appointments in 2017 who have taken WB TET exam conducted in 2014. Today on 12th May 36000 teachers have been...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *