Lalitha Devi Pooja Vidhanam Telugu PDF

Lalitha Devi Pooja Vidhanam Telugu PDF download free from the direct link given below in the page.

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Lalitha Devi Pooja Vidhanam Telugu

పూజ కానీ, రేపు దేవీ నవరాతృలలో చేసే దుర్గా పూజ కానీ- మరే దేవీ పూజ కానీ మీరు సొంతంగా- రోజూ ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ టపా రాస్తున్నాను. మీరు చేయ వలసిందల్లా ” శ్రీ లలితా దేవీ ” అని ఉన్నచోట మీరు పూజించే దేవత పేరు పెట్టు కోవడమే. స్త్రీ స్వరూప దేవతలకు మాత్రమే పనికి వచ్చే శ్లోకాలతో రాయబడుచున్నది. కనుక పురుష స్వరూప దేవతలకు పనికి రాదు.

ఈ టపాలో పూజ చేయవలసిన విధానంతో పాటు, లలితా దేవి పూజను కూడా రాస్తున్నాను. అది అందరికీ ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. నిజానికి ఈ పూజా మంత్రాలతో కూడిన అనేక పుస్తకాలు బయట షాపుల్లో దొరుకుతున్నాయి. కానీ ఏది ఎందుకు చేస్తున్నామో చెపుతూ ఒకొక్క సేవ వివరిస్తే బాగుంటుంది అనే భావనతో ఈ టపా రాస్తున్నాను. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లలితా పరమేశ్వరీముద్దిశ్య శ్రీ లలితాపరమేశ్వరీ ప్రీత్యర్థం యవచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

Lalitha Devi Pooja Vidhanam Telugu

పీఠపూజ –
ఆధారశక్త్యై నమః | వరాహాయ నమః |
దిగ్గజేభ్యో నమః | పత్రేభ్యో నమః |
కేసరేభ్యో నమః | కర్ణికాయై నమః |
ఆత్మనే నమః | బ్రహ్మణే నమః |
సప్తప్రాకారం చతుర్ద్వారకం సువర్ణ మండపం పూజయేత్ |
ప్రాగామ్నాయమయ పూర్వద్వారే ద్వార శ్రియై నమః |
దక్షిణామ్నాయమయ దక్షిణద్వారే ద్వార శ్రియై నమః |
పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారే ద్వార శ్రియై నమః |
ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారే ద్వార శ్రియై నమః |
తన్మధ్యే క్షీరసాగరాయ నమః |
క్షీరసాగరమధ్యే రత్నద్వీపాయ నమః |
రత్నద్వీపమధ్యే కల్పవృక్షవాటికాయై నమః |
తన్మధ్యే రత్నసింహాసనాయ నమః |
రత్నసింహాసనోపరిస్థిత శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాయై నమః |

ధ్యానం –
అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖై-
రహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||
ఏహ్యేహి దేవదేవేశి త్రిపురే దేవపూజితే
పరామృతప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే |
ఇతి బిందుపీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీమత్కామేశ్వరాంకే శ్రీలలితాంబికాం ఆవాహయేత్ |
ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః ధ్యాయామి |

ప్రాణప్రతిష్ఠ –
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణ మిహనో ధేహి భోగం
జ్యోక్పశ్చేమ సూర్య ముచ్చరన్త
మను మతే మృడయాన స్వస్తి –
అమృతంవై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే ||
ఆవాహితా భవ స్థాపితా భవ |
సుప్రసన్నో భవ వరదా భవ |
స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

ఆవాహనం –
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
సహస్రదళపద్మస్థాం స్వస్థాం చ సుమనోహరాం |
శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆవాహయామి |

ఆసనం –
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ||
అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా |
ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ||
శుద్ధగంగోదకమిదం సర్వవందితమీప్సితం |
పాపేధ్మవహ్నిరూపం చ గృహ్యతాం పరమేశ్వరి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
కాం సోస్మితాం హిరణ్యప్రాకారా-
-మార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ |
పద్మే స్థితాం పద్మవర్ణాం
తామిహోపహ్వయే శ్రియమ్ ||
పుష్పచందనదూర్వాదిసంయుతం జాహ్నవీజలం |
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం
శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే-
-ఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||
పుణ్యతీర్థాదికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా |
గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్యమాచమనీయకమ్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
క్షీరం –
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః క్షీరేణ స్నపయామి |

దధి –
దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం –
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆజ్యేన స్నపయామి |

మధు –
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీర్నః సన్త్వౌషధీః |
మధునక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః |
మధుద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః |
మాధ్వీర్గావో భవంతు నః |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః మధునా స్నపయామి |

శర్కరా –
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అదాభ్యః |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం –
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఫలోదకేన స్నపయామి |

శుద్ధోదక స్నానం –
ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో
వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః |
తస్య ఫలాని తపసా నుదన్తు
మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
సుగంధి విష్ణుతైలంచ సుగంధామలకీజలం |
దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరప్రియే |
ఓం శ్రీ లలిత దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ||
సౌందర్యముఖ్యాలంకారం సదా శోభావివర్ధనం |
కార్పాసజం చ క్రిమిజం వసనం దేవి గృహ్యతాం |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

వ్యజనచామరం –
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
శివవాయుప్రదే చైవ దేహే చ సుఖదే వరే |
కమలే గృహ్యతాం చేమే వ్యజనశ్వేతచామరే |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః వ్యజనచామరాభ్యాం వీజయామి |

గంధం –
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
మలయాచలసంభూతం వృక్షసారం మనోహరం |
సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః శ్రీ గంధాన్ ధారయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |

ఆభరణం –
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ||
రత్నస్వర్ణవికారం చ దేహాలంకారవర్ధనం |
శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి –
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ || ౧౧ ||
నానా కుసుమ నిర్మాణం బహుశోభాప్రదం పరం |
సర్వభూతప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

శ్రీ లలితా అష్టోత్తర శతానామావళిః చూ.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం చూ.
శ్రీ లలితా సహస్రనామావళిః చూ.

ధూపం –
ఆపః సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||
వృక్షనిర్యాసరూపం చ గంధద్రవ్యాది సంయుతం |
శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
జగచ్చక్షుః స్వరూపం చ ప్రాణరక్షణకారణం |
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః దీపం సమర్పయామి |

నైవేద్యం –
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
నానోపహారరూపం చ నానారససమన్వితం |
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపి ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం –
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వా-
-న్విన్దేయం పురుషానహమ్ ||
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం |
జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
సంమ్రాజం చ విరాజంచాభిశ్రీర్ యా చ నో గృహే |
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సంసృజామసి |
కర్పూరదీపతేజస్త్వం అజ్ఞానతిమిరాపహ |
దేవీప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ ||
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు |
నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –
(దుర్గా సూక్తం చూ.)
సద్భావపుష్పాణ్యాదాయ సహజప్రేమరూపిణే |
లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః మంత్రపుష్పాణి సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః గజానారోహయామి |
యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |
దేవభూపార్హభోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతాం ||
శ్రీ లలితా దేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |

అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ లలితా దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ లలితా దేవీ పాదోదకం పావనం శుభం ||
ఓం శ్రీ లలిత దేవ్యై నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

You can download the Lalitha Devi Pooja Vidhanam Telugu PDF using the link given below.

2nd Page of Lalitha Devi Pooja Vidhanam Telugu PDF
Lalitha Devi Pooja Vidhanam Telugu

Lalitha Devi Pooja Vidhanam Telugu PDF Free Download

1 more PDF files related to Lalitha Devi Pooja Vidhanam Telugu

Sri Lalitha Shodasopachara Puja Vidhanam PDF

Sri Lalitha Shodasopachara Puja Vidhanam PDF

Size: 0.29 | Pages: 13 | Source(s)/Credits: www.hariome.com | Language: Telugu

Sri Lalitha Shodasopachara Puja Vidhanam PDF download using the link given below.

Added on 28 Mar, 2023 by Pradeep

REPORT THISIf the purchase / download link of Lalitha Devi Pooja Vidhanam Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

 • B Pharmacy Colleges List in Telangana

  The students who want to get admission in B Bharmacy courses but are confused to choose the best college to take admission so you can choose best college in Telangana state from the list given here. Below we have provided the direct download link for B Pharmacy Colleges List in...

 • Lalitha Chalisa Telugu

  The Lalitha Chalisa (40-verse) is a prayer addressed to Sri Lalitha Tripura Sundari Devi, asking for her grace. The many virtues and accomplishments of Sri Lalitha Devi are exalted in this prayer. The hymn “Lalita Chalisa” is a prayer to the Hindu deity Lalita Tripurasundari, also referred to as “Goddess...

 • Lalitha Sahashranama Stotram Telugu

  Lalita Sahasranama is a text from Brahmanda Purana. It is a sacred text of the Hindu worshippers of Goddess Lalita Devi, considered to be a manifestation of the Divine Mother (Shakti) or Goddess Durga (Parvati, Mahakali). Etymologically, “Lalitha” means “She Who Plays” The Lalita Sahasranama is a thousand names of...

 • Manidweepa Varnana (మణిద్వీప వర్ణన తెలుగు) Telugu

  Manidweepa Varnana is a very powerful sloka in Devi Bhagavatam. It is said that reciting it with devotion or even just hearing it will do wonders for the devotee. Many do Manidweepa pooja which involves chanting the 32 slokas of Manidweepa Varnana, 9 times per day for 9 consecutive days....

 • Sree Lalitha Sahasranama Stotram in

  Sree Lalita Sahasranama, also known as the Lalitha Sahasranamam, is a Hindu text extracted from Brahmanda Purana. In Hinduism there are traditionally 18 Puranas. The Sree Lalitha Sahasranama Stotram is the thousand names (1000 Names of Devi) of the Hindu mother goddess Lalita. You can download the Lalitha Sahasranama Stotram...

 • Sri Lalitha Sahasranamam (లలిత సహస్రనామం) Telugu

  Lalita Sahasranama, also known as the Sri Lalitha Sahasranamam Stotram, is a Hindu text extracted from Brahmanda Purana. In Hinduism, there are traditionally 18 Puranas. The Sri Lalita Sahasranama Stotram is a thousand names (1000 Names of Devi) of the Hindu mother goddess Lalita. It is observed that regular chanting...

 • Varahi Kavacham Telugu

  Varahi Kavacham Telugu PDF is the armor of Sri Varahi Devi. It is believed that chanting this Kavacham will protect the devotee from all sorts of difficulties and problems like armor protecting a soldier in battle. Varahi Devi is the Chief Commander of all the forces of Sri Lalitha Devi...

 • ஸ்ரீ லலிதா சஹஸ்ரநாமம் (Lalitha Sahasranamam) Tamil

  Lalita Sahasranama is a divine song dedicated to the goddess Lalita. Lalita Devi is a form of Adi Shakti, also worshiped as “Shodashi” and “Tripura Sundari”. The prayers of Durga, Kali, Parvati, Lakshmi, Saraswati and Bhagwati Devi are also used to recite the Lalita Sahasranama Falashruti and Sri Lalita Sahasranama...