Ayyappa Bhajana Songs Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Ayyappa Bhajana Songs Telugu

Ayyappa Bhajana Songs Telugu

కార్తీక మాసము వచ్చిందంటే

కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా
నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా
శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య
శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య ||కార్తీక||
నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము
విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం
పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం
పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము
స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా
పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా ||కార్తీక||
సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి
హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి
ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా
ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య
ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||

అది గదిగో శబరి మలా

అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా
అది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే
స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల ||శరణమయ్యప్ప||
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల ||శరణమ||
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది ||శరణమ||

శబరిమలై నౌక సాగీ పోతున్నది

పల్లవి : శభరిమలై నౌకా సాగీ పోతున్నది
అయ్యప్ప నౌక సాగీ పోతున్నది
నామంబు పలికితే నావ సాగి పోతుంది
శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
నామంబు పలికితే నావ సాగి పోతుంది. ||శరణం||
తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
నామంబు పలికితే నావ సాగి పోతుంది ||శరణం||
కదలండి బాబు మెదలండి బాబు
అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
నామంబు పలికితే నావ సాగిపోతుంది ||శరణం||

కొండల్లో కొలువున్న కొండదేవరా

పల్లవి కొండల్లో కొలువున్న కొండదేవరా
మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1. కార్తీక మసాన కొండదేవరా
మేము మాలలే వేస్తాము కొండదేవరా ||కొం||
2. అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా ||కొం||
3. కరిమలై శిఖరాన కొండదేవరా
మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా ||కొం||
4. పంపానది తీరాన కొండదేవరా
మా పాపములను బాపవయ్య కొందడేవరా ||కొం||
5. పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
మేము పరవశించినామయ్య కొండదేవరా ||కొం||
6. నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా ||కొం||

కొండవాడు మా అయ్యప్పా

పల్లవి కొండవాడు మా అయ్యప్పా
జాలి గుండె వాడు మా అయ్యప్పా
ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా ..2.. ||కొం||
1. నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
మణికంఠ నామదేయుడు ఓహో.. ||కొం||
2. రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు
అరుపులే మా పిలుపులు అయ్యప్ప
శరణాలే మేలుకొలుపులు ఓహో… ||కొం||
3. పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే
దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు ఓహో.. ||కొం||

అయ్యప్ప స్వామినీ చూడాలంటే

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి ||స్వామి||
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి ||స్వామి||
యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి ||స్వామి||
ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి
పేటైసుల్లి ఆడాలి ||స్వామి||
ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి ||స్వామి||
పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి
మనము పావనము అవ్వాలి

కనివిని ఎరుగుని ఘనయోగం

కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రం
ఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
1. శ్రీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం
ఏకభుక్తమే తింటూ నీకు అర్పణం అంటూ
ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది
భక్తి ప్రపత్తులు దాటేది శరణమని చాటేది
2. అపితాహార్యం ఒక నియమం
సంస్క ృతిక వర్గవమొక నియమం
అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ
మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది
కర్మేఫలముగా తలచేది తత్‌త్వమ్‌ అని తెలిచేది.

జిందగీమే ఏకబార్‌ శబరియాత్ర

పల్లవి జిందగీమే ఏక్‌బార్‌ శబరియాత్ర ఛలో ఛలో
హరిహరపుత్ర అయ్యప్పకో దర్శన్‌ కర్‌కే ఆవో
స్వామియే శరణం అయ్యప్ప స్వామియే
శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||జిం||
జీవన్‌తో కుచ్‌ బఢానహీ ఉస్‌కా ఛోటాతోపాహై
ఉస్‌కా బేకార్‌ మత్‌ కరో భక్తి, భజన్‌ సే ధ్యాన్‌ కరో ||జిం||
పాప్‌ సబ్‌ కుచ్‌ మిట్‌ జాతా హై పంపా నదిమే స్నాన్‌ కరో
జ్యోతి స్వరూప్‌కో దర్శన్‌ కో జీవన్‌ ముక్తి మిల్‌తీహై
తుఝె జీవన్‌ ముక్తి హోతా హై ||జిం||

రాజా రాజా పందల రాజ

రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు ||2||
శరణం అయ్యప్పా శరణం స్వామి – స్వామీ అయ్యప్పా శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి – పొన్నంబలవాసా శరణం స్వామి
అలుద పంబ జలములోన తీపివి నీవే
అడవిలోని జీవాల ఆటవు నీవే
బంగారు కొండపైన వేదము నీవే
పంచగిరులు ధ్వనియించే నాధము నీవే ||శరణం అయ్యప్పా||
భూతదయను బోధించిన కరుణామూర్తి
భూతనాధ సదానంద శాంతమూర్తి
ఇంద్రియములు జయించినా సుందరమూర్తి
ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి ||శరణం అయ్యప్పా||
వావరున్ని వాల్మీకిగ మలచినావయా
వనములోన ఘనముగా నిలిచినావయా
గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా
మా కన్నియు సమస్త నీవే కాదా ||శరణం అయ్యప్పా||
తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ
గురువులు గౌరవించు నీ సేవలూ
కలియుగమును రక్షించే అభయ హస్తమూ
ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ ||శరణం అయ్యప్పా||

అమితానందం పరమానందం

అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||
హరియే మోహిని రూపం
హరయే మోహన రూపం
హరిహర సంగం అయ్యప్ప జననం
ముద్దులొలుకు సౌందర్యం ||అమితానందం||
నీవు పుట్టుట పంబా తీరము
నీవు పెరుగుట పందళ రాజ్యము
నీ కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామం
పులిపాల్‌ కడవికి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే వన్‌పులి వాహనం
ఇచ్చెను శబరికి మోక్షము ||అమితానందం||
ఇరుముడి నీకభిషేకం
పదునెట్టాంబడి ప్రదాయము
మకర సంక్రమణ సంధ్యా సమయం
మకరజ్యోతియే సత్యరూపము ||అమితానందం||

శాస్త్రా సన్నిధిలో అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం
ఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా ||శాస్తా||

అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా ||శాస్తా||

పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా ||శాస్తా||
చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||

విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా ||శాస్తా||

లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా ||శాస్తా||

కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా ||శాస్తా||

గురుస్వామి గురుస్వామి

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి
నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి ||గు||
కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు
అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు ||గు||
నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి
నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి ||గు||
గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు
నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి ||గురు||

వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే
వీల్లాలి వీరనే వీరమణిగండనే
రాజాది రాజనే రాజకుమారనే
స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో ||వీల్లాలి||
ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము
వావరుని చూసినాము – వందనాలే చేసినాము
మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము
పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం ||వీల్లాలి||
అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము
ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము
కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము
ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య
స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో ||వీల్లాలి||
శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము
పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము
శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము
సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము
అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము
మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా
స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో ||వీల్లాలి||

స్వామియే శరణం శరణమయ్యప్పా

స్వామియే శరణం శరణమయ్యప్పా
శరణం శరణం స్వామి అయ్యప్పా
అమ్మవారు ఉండేది వైకుంఠం – అయ్యవారు ఉండేది కైలాసం
అన్నగారు ఉండేది ఫళనిమలా – మన స్వామి వారు ఉండేది శబరిమలా ||స్వామి||
హరిహర అంటారు అమ్మవారి – హరిహర అంటారు అయ్యవారిని
హరోంహర అంటారు అన్నగారిని – శరణశరణమంటారు స్వామివారిని ||స్వామి||
గరుడ వాహనం అమ్మవారిది – వృషభ వాహనం అయ్యవారిది
పచ్చనెమలి వాహనం అన్నగారిది – వన్‌పులి వాహనం స్వామి వారిది ||స్వామి||
శ్రీ చక్రధారియే అమ్మవారి – త్రిశూల ధారియే అయ్యవారు
వేలాయుధ పాణివే అన్నగారూ – అభయ హస్తుడే స్వామివారు ||స్వామి||

పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం

పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు
కట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి
పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా
హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే
భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప
నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే
పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||

ఉయ్యాల ఊగుచున్నారు

1. ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు బంగారు ఉయ్యాల ఊగుచున్నారు
2. కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా
మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా
3. విల్లాలివీరుడే నీలమణికంఠుడే
రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే
4. పంబలో బాలుడే పందళరాజుడే
కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే
5. ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే
ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే
6. కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే
కారుణ్యశీలుడే కరుణించే దేవుడే

నేను నిజమైతే నా స్వామ నిజమౌనా

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా ||నేను నిజమైతే||
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా ||నేను నిజమైతే||
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా ||నేను నిజమైతే||
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా ||నేను నిజమైతే||

You can download the Ayyappa Bhajana Songs Telugu PDF using the link given below.

2nd Page of Ayyappa Bhajana Songs Telugu PDF
Ayyappa Bhajana Songs Telugu

Ayyappa Bhajana Songs Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of Ayyappa Bhajana Songs Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.