KGBV Notification 2023 AP - Summary
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీఎస్‌ఎస్ (APSSS) నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1358 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.
ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల ఖాళీలు మరియు విద్యార్హత వివరాలను మరిన్ని వివరాలు ఈ కధనంలో చదవండి. మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in లో 30 మే 2023 నుంచి 5 జూన్ 2023న 11.59 pm వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు..
KGBV Notification 2023 AP in Telugu
సంఘం పేరు | AP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సొసైటీ |
రిక్రూట్‌మెంట్ విధానం | ఆన్‌లైన్ అప్లికేషన్ |
ఖాళీలు | 1358 |
పోస్టుల పేరు | ప్రిన్సిపాల్, PGT, CRT, PET |
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు | 30 మే 2023 నుంచి 5 జూన్ 2023వరకు |
దరఖాస్తు రుసుము | రూ. 100 |
అధికారిక వెబ్‌సైట్ | apkgbv.apcfss.in |
పేపర్ నోటిఫికేషన్ విడుదల | 27 మే 2023 |
ఆన్‌లైన్ దరఖాస్తుల రసీదు | 30 మే 2023 నుండి 05 జూన్ 2023 వరకు |
రాష్ట్ర కార్యాలయం ప్రతి పోస్ట్‌కు1:3లో మెరిట్ జాబితాను రూపొందించడం | 06 జూన్ 2023 నుండి 07 జూన్ 2023 వరకు |
జిల్లా స్థాయి కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ | 8 జూన్ 2023 నుండి 9- జూన్ 2023 వరకు |
స్కిల్ టెస్ట్ / పర్సనాలిటీ టెస్ట్ జిల్లా స్థాయి | 10 జూన్ 2023 నుండి 12 జూన్ 2023 వరకు |
తుది ఎంపిక జాబితా | 12 జూన్ 2023 |
అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల జారీ | 13 జూన్ 023 |
కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌లోకి ప్రవేశించడం | 13 జూన్ 2023 |
డ్యూటీకి రిపోర్టింగ్ | 14 జూన్ 2023 |
AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు | ఖాళీలు |
ప్రిన్సిపాల్ | 92 |
PGT | 846 |
CRT | 374 |
PET | 46 |
మొత్తం | 1358 |
You can download the KGBV Notification 2023 AP PDF using the link given below.