Republic Day Speech Telugu PDF
Republic Day Speech Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.
India celebrates every year Republic Day every year on 26th January with lots of preparations. India is celebrating the 74th Republic Day on the commemoration of a historic moment when India’s constitution came into start on 26th January 1950, an occasion that completed the country’s long-required change toward becoming an independent republic country.
నా గౌరవనీయ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు మరియు నా సహవిద్యార్థులందరికీ నా ఉదయం శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. మన దేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనమందరం ఇక్కడ గుమిగూడామని మనందరికీ తెలుసు. ఇది మనందరికీ చాలా శుభ సందర్భం. 1950 నుండి, మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవాన్ని చాలా ఆనందంతో మరియు ఆనందంతో జరుపుకుంటాము. పండుగ ప్రారంభానికి ముందు, మా ముఖ్య అతిథులు దేశ జాతీయ జెండాను ఎగురవేస్తారు. దీని తరువాత మనమందరం భారతదేశ ఐక్యత మరియు శాంతికి చిహ్నంగా ఉన్న జాతీయ గీతాన్ని నిలబడి పాడతాము.
Republic Day Speech Telugu PDF
ప్రసంగం-1
ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26. అందువలన మనం ఈరోజును రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాము. మనకు బ్రిటిష్ వారి నుండి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనం బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసుకున్నాము. మన రాజ్యాంగ పరిషత్తు వారు రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చినది జనవరి 26. అందువలన ఈరోజు కులాలు, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జరుపుకోవాల్సిన జాతీయ పండుగ.
ప్రసంగం-2
మన పాఠశాలలోని HMకు, టీచర్లకు మరియు మన అతిథులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక జాతీయ పండుగ. భారతదేశంలోని ప్రతి భారతీయుడు జనవరి 26ను ఎంతో గొప్పగా ఉంటాడు జరుపుకుంటాడు. రిపబ్లిక్ / గణతంత్రం అనగా రాజ్యాధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా గాని లేక పరోక్షంగా గాని ఎన్నిక కావడం. అందుచేత మన రాజ్యా ధినేత అయిన రాష్ట్రపతి ఆ రోజున జెండా ఎగుర వేస్తారు. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకు రాజ్యాంగం లేదు. అందువలన బి.ఆర్. అంబేద్కర్ మరియు మిగిలిన సభ్యుల కృషి వలన మన రాజ్యాంగం జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చింది. అందువలన ఈరోజు మనకు ప్రత్యేకమైనది.
ప్రసంగం-3
పిల్లలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడం యొక్క దేశం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనవరి26, 1950 నాడు మనచే రచించిన మన రాజ్యాంగం ఈ రోజున అమలు లోకి వచ్చింది. అందువలన 26న గణతంత్ర దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజున భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయన ఎగురవేసిన తర్వాతనే మనం ఎగురవేయవలెను. ఎందుకంటే ఆయన మనకు రాజ్యాధినేత మరియు రాజ్యంగా సంరక్షకుడు. ఇది కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయ భారతదేశ పౌరుడు ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన పండుగ.
You can download the Republic Day Speech Telugu PDF using the link given below.