Varalakshmi Vratham Pooja Items List Telugu - Summary
సంపద, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్ట్ 16న వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుంది.
ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీ దేవికి వివరించినట్టుగా స్కంద పురాణం చెబుతోంది. శ్రీహరి మహా విష్ణువు జన్మించిన శ్రవణా నక్షత్రంలో వచ్చే మాసమే శ్రావణ మాసం. అటువంటి పవిత్రమైన మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతం చేసుకునేందుకు కావాల్సిన పూజా సామాగ్రి, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
పూజా సామాగ్రి (Varalakshmi Vratham Pooja Items List)
- పసుపు
- కుంకుమ
- వాయనాలకు అవసరమైన వస్తువులు
- ఎరుపు రంగు రవిక వస్త్రం
- గంధం
- పూలు
- పండ్లు
- తమలపాకులు
- వక్కలు
- తోరము కట్టేందుకు దారం
- కొబ్బరికాయ
- దీపం కుందులు
- ఐదు వత్తులతో హారతి ఇచ్చేందుకు అవసరమైన పంచహారతి పళ్ళెం
- దీపారాధనకు నెయ్యి
- కర్పూరం
- అగర్ వత్తులు
- బియ్యం
- శనగలు
- చిల్లర నాణేలు
- అమ్మవారి కలశం ఏర్పాటుకు కావలసిన పీట
- అక్షింతలు