Telugu Novels - Summary
A novel is an imaginative prose narrative that delves into human experiences. The rich tradition of Telugu novels has gained popularity and significance over the years, tracing back to a long-standing literary history. Reading Telugu novels can be an enriching experience as they offer unique and relatable stories in simple yet profound language.
Understanding Telugu Novels
Telugu novels are a beautiful expression of culture, emotions, and storytelling that capture various aspects of life. They are known for their captivating stories and deep character developments that resonate with readers. 📚
Highlights of Notable Telugu Novels
కొత్తనీరు
“ఎవరి దగ్గిర నించండీ ఉత్తరం?” చదువుతున్న భగవద్గీత పక్కన పెట్టి అప్పుడే పోస్టుమాన్ తెచ్చియిచ్చిన ఉత్తరాన్ని చదువుతున్న జగన్నాథంగారిని అడిగింది పార్వతమ్మ వత్తులు చేసుకుంటూ.
“పెద్దవాడి దగ్గరనించి!”
“ఏం రాశాడు? ….దసరాకి వస్తామన్నారా?….” వత్తులు చేయడం ఆపి కుతూహలంగా అడిగింది పార్వతమ్మ.
“హుఁ!….ఇలాంటి గొడవలు వస్తాయని నాకు తెలియదూ!….ఎంతయినా వాడికంటే పాతికేళ్ళు ముందు పుట్టిన వాడిని….కాస్తో కూస్తో లోకజ్ఞానం లేకుండా చెప్పానా అప్పుడు! …చెపితే విన్నాడా? పెద్దవాళ్ళ మాట వినక బాగుపడిందెవడు?….ఎందుకు చెప్పారో అన్న జ్ఞానం వుందా అప్పుడు?” …
“ఏమిటయిందండీ!…..ఏం రాశాడు?” ఆత్రుతగా చూసింది పార్వతమ్మ.
“ప్రేమ, ప్రేమ అని వల్లించాడు! తల్లి దండ్రుల మాట కాదని చేసుకున్నాడు. కాని, ముందు చూపు ఏమన్నా వుండి ఏడిసిందా అప్పుడు?….” ఉత్తరం క్రిందపడేసి కళ్ళజోడు తీసి పంచతో తుడుస్తూ భార్యవైపు చూశారు ఆయన.
“అబ్బ! …. ఏం జరిగిందో చెప్పకుండా….ఎప్పుడో జరిగి పోయిందానికి బాధపడడం ఎందుకు! ….” విసుక్కుంది పార్వతమ్మ.
“ఎప్పుడో జరిగిన దాని ఫలితం యిప్పుడు అనుభవానికి వచ్చింది అబ్బాయిగారికి.” వెటకారంగా మాట్లాడారు ఆయన. “నీ మనవరాలు పెళ్ళీడు కొచ్చిందా? …. ఇప్పుడు తెలుస్తూంది కష్టం. నిష్ఠూరం!” ….
“ఏమిటండీ యీగోల….అసలు విషయం చెపుతారా చెప్పరా?”…..విసుగ్గా అడిగింది పార్వతమ్మ.
“ఏముందే చెప్పడానికి?…..ఇంకా బోధపడలేదూ?…..ఉష పెళ్ళీడు కొచ్చిందా! దాని పెళ్ళి ఓ సమస్య అయిందట వాడికి. వాడి భార్య ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారట. వీడేమో తెలుగు సంబంధాలు చూస్తున్నాడట. మీనాక్షేమో ససేమిరా అరవ సంబంధమే చేయాలంటుందిట! వాళ్ళ దూరపు బంధువు లిద్దరు మంచి ఉద్యోగాలలో వున్నారట. వాళ్ళలో ఒకరి కిచ్చి చేయమంటుందిట. మనవాడు తెలుగు సంబంధమే చేస్తానంటాడట. వాళ్ళిద్దరి తగువు అలా వుండగా యీ మధ్య వచ్చి చూసిన రెండు మూడు సంబంధాలవాళ్ళు తల్లి, తండ్రి వేరువేరు జాతులని తెలియగానే చేసుకోడానికి యిష్టపడలేకపోయారు. అరవ వలలు తెలుగువారి క్రింద జమ కడుతున్నారని, తెలుగువాళ్ళు అరవవారి క్రింద జమ కట్టి చేసుకోడానికి యిష్టపడడం లేదని రాశాడు. ఈ విషయం అంతా ఓ సమస్యగా తయారయింది! ఇంతేకాక నీ మనవరాలు తల్లిదండ్రుల యిద్దరి మాట కాదనలేక ముందు వూరుకున్నా, యిప్పుడు మొండికెత్తి వాళ్ళిద్దరు చెప్పిన సంబంధాలూ తన కక్కరలేదని తన పెళ్ళి తనే యిష్టం వచ్చిన వాడితో చేసుకుంటా నంటూందిట! …. ఇదీ సంగతి! ‘అమ్మాయికి మీమీద గౌరవాభిమానాలు వున్నాయి. చెపితే మీమాట కాదనదు. దానికి నచ్చచెప్పి ఒప్పించి, ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్ళి కుదర్చమని రాశాడు రామం” అని జగన్నాథంగారు ఉత్తరం సారాంశం భార్యకి వివరించారు.
“ఆఁ…..వాడు మనమాట విన్నాడా….వాడి కూతురు వినబోతుందనడానికి?….ఈ కాలపు పిల్లలు యింకో రెండాకులు ఎక్కువే చదువుకున్నారు”….పార్వతమ్మ గొణిగింది.
“ఉషని నాలుగైదు రోజుల్లో ఏదో వంకతో మీ దగ్గరకి పంపుతాను. నెమ్మదిగా దానిని దారిలోకి తీసుకువచ్చే బాధ్యత మీదే” అని రాశాడు. అబ్బాయిగారికి యిప్పటికయినా తెలిసిందన్నమాట. ఇలా జాతి మతాలు చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే అనర్ధాలేమిటో…..అంతే, తనదాకా వస్తేగాని తెలియదు. తల్లి తండ్రుల బాధ యిప్పటికి తెలిసిఉంటుంది వాడికి.” నిష్ఠూరంగా అన్నారు ఆయన. గతం గుర్తుకు తెచ్చుకుంటూ.
ఫైనల్ గమనిక: చదివినట్లయితే తెలుగు నవలల PDFs డౌన్లోడ్ చేసుకోవడం మరచిపోండి. Telugu novels offer fascinating insights into everyday life and provide an engaging reading experience for all ages.