లక్ష్మి పూజ విధానం | Deepavali Pooja Vidhanam Telugu
లక్ష్మి పూజ విధానం | Deepavali Pooja Vidhanam PDF in Telugu read online or download for free from the official website link given at the bottom of this article.
Goddess Lakshmi blessed us with the money and wealth to live a prosperous life. If you worshiped Mata Lakshmi with full devotion and dedication, you will get the ultimate blessings of the goddess. There are many people who are in debt and living under the pressure of several loans.
లక్ష్మి పూజ విధానం PDF త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.
లక్ష్మి పూజ విధానం | Diwali Lakshmi Pooja Vidhanam in Telugu
లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ‘నిత్యానపాయిని’ లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని ‘భార్గవి’ అని కూడా అంటారు.
దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.
ప్రాణ ప్రతిష్ఠ
‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.
కలశ స్థాపన
వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.
‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’
లక్ష్మీదేవి ఆధాంగ పూజ.
చంచలాయై నమః- పాదౌ పూజయామి
చపలాయై నమః- జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః -ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః- కటిం పూజయామి
పద్మాలయాయై నమః- నాభిం పూజయామి
మదనమాత్రే నమః- స్తనౌ పుజయామి
లలితాయై నమః -భుజద్వయం పూజయామి
కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి
సుముఖాయై నమః- ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి
సునాసికాయై నమః నాసికం పూజయామి
సునేత్రాయై నమః ణెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
You can download Deepavali Lakshmi Pooja Vidhanam Telugu PDF by clicking on the following download button.
