Sai Nakshatra Malika Telugu - Summary
శ్రీ సాయి నక్షత్ర మాలికా – Sai Nakshatra Malika Telugu
Sai Nakshatra Malika Telugu is a cherished devotional text that highlights the greatness of Sai Baba. This beautiful piece of literature is filled with prayers and verses that connect devotees with the divine. Discover the spiritual essence of Sai Baba’s teachings simply by reading this text. You can also download the Sai Nakshatra Malika PDF for easy access.
ప్రారంభం – Introduction
షిరిడీసదనా శ్రీసాయీ
సుందర వదనా శుభధాయీ
జగత్కారణా జయసాయీ
నీ స్మరణే ఎంతో హాయీ || ౧ ||
శిరమున వస్త్రము చుట్టితివీ
చినిగిన కఫినీ తొడిగితివీ
ఫకీరువలె కనిపించితివీ
పరమాత్ముడవనిపించితివీ || ౨ ||
భక్తి – Devotion
చాందుపాటేలుని పిలిచితివీ
అశ్వము జాడ తెలిపితివీ
మహల్సాభక్తికి మురిసితితివీ
సాయని పిలిచితె పలికితివీ || ౩ ||
గోధుమ పిండిని విసరితివీ
కలరా వ్యాధిని తరిమితివీ
తుఫాను తాకిడి నాపితివీ
అపాయమును తప్పించితివీ || ౪ ||
అయిదిళ్లలో భిక్షడిగితివీ
పాపాలను పరిమార్చితివీ
బైజాసేవను మెచ్చితివీ
సాయుజ్యమునూ ఇచ్చితివీ || ౕ ||
నీళ్ళను నూనెగ మార్చితివీ
దీపాలను వెలిగించితివీ
సూకరనైజం తెలిపితివీ
నిందలు వేయుట మాన్పితివీ || ౖ ||
ఊదీ వైద్యము చేసితివీ
వ్యాధులనెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ
చిత్తశాంతి చేకూర్చితివీ || ౭ ||
అల్లా నామము పలికితివీ
ఎల్లరి క్షేమము కోరితివీ
చందనోత్సవము చేసితివీ
మతద్వేషాలను మాపితివీ || ౮ ||
కుష్ఠురోగినీ గాంచితివీ
ఆశ్రయమిచ్చీ సాకితివీ
మానవధర్మం నెరిపితివీ
మహాత్మునిగ విలసిల్లితివీ || ౹ ||
ధునిలో చేతిని పెట్టితివీ
కమ్మరిబిడ్డను కాచితివీ
శ్యామా మొర నాలించితివీ
పాము విషము తొలిగించితివీ || ౧౦ ||
జానెడు బల్లను ఎక్కితివీ
చిత్రముగా శయనించితివీ
బల్లి రాకను తెలిపితివీ
సర్వజ్ఞుడవనిపించితివీ || ౧౧ ||
లెండీ వనమును పెంచితివీ
ఆహ్లాదమునూ పంచితివీ
కర్తవ్యము నెరిగించితివీ
సోమరితనమును తరిమితివీ || ౧౨ ||
కుక్కను కొడితే నొచ్చితివీ
నీపై దెబ్బలు చూపితివి
ప్రేమతత్వమును చాటితివీ
దయామయుడవనిపించితివీ || ౧౩ ||
అందరిలోనూ ఒదిగితివీ
ఆకాశానికి ఎదిగితివీ
దుష్టజనాళిని మార్చితివీ
శిష్టకోటిలో చేర్చితివీ || ౧౪ ||
మహల్సా ఒడిలో కొరుగితివీ
ప్రాణాలను విడనాడితివీ
మూడు దినములకు లేచితివీ
మృత్యుంజయుడనిపించితివీ || ౧ౕ ||
కాళ్ళకు గజ్జెలు కట్టితివీ
లయ బద్ధముగా ఆడితివీ
మధుర గళముతో పాడితివీ
మహదానందము కూర్చితివీ || ౧ౖ ||
అహంకారమును తెగడితివీ
నానావళినీ పొగడితివీ
మానవసేవా చేసితివీ
మహనీయుడవనిపించితివీ || ౧ ||
దామూ భక్తికి మెచ్చితివీ
సంతానమునూ ఇచ్చితివీ
దాసగణుని కరుణించితివీ
గంగాయమునలు చూపితివీ || ౮ ||
పరిప్రశ్నను వివరించితివీ
నానాహృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ
గురుభక్తిని ఇల చాటితివీ || ౯ ||
చేతిని తెడ్డుగ త్రిప్పితివీ
కమ్మని వంటలు చేసితివీ
ఆర్తజనాళిని పిలిచితివీ
ఆకలి బాధను తీర్చితివీ || ౨౦ ||
మతమును మార్చితె కసరితివీ
మతమే తండ్రని తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ
సాయి మాతగా అలరితివీ || ౨౧ ||
హేమాదును దీవించితివీ
నీదు చరిత వ్రాయించితివీ
పారాయణ చేయించితివీ
పరితాపము నెడబాపితివీ || ౨౨ ||
లక్ష్మీబాయిని పిలిచితివీ
తొమ్మిది నాణెములిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ
ముక్తికి మార్గము చూపితివీ || ౨౩ ||
బూటీ కలలో కొచ్చితివీ
ఆలయమును కట్టించితివీ
తాత్యా ప్రాణము నిలిపితివీ
మహాసమాధీ అంది ప్రతి || ౨౪ ||
సమాధి నుండే పలికితివీ
హారతినిమ్మని అడిగితివీ
మురళీధరునిగ నిలిచితివీ
కరుణామృతమును చిలికితివీ || ౨౫ ||
చెప్పినదేదో చేసితివీ
చేసినదేదో చెప్పితివీ
దాసకోటి మది దోచితివీ
దశదిశలా భాసిల్లితివీ || ౨౬ ||
సకల దేవతలు నేవెనయా
సకల శుభములను కూర్చుమయా
సతతమునిను ధ్యానింతుమయా
సద్గురు మా హృదినిలువుమ్మయా || ౨౭ ||
Sai Nakshatra Malika
భవరోగాలకు మూలికా
పారాయణ కిది తేలికా
ఫలమిచ్చుటలో ఏలికా
Download the Sai Nakshatra Malika PDF using the link provided below for convenient access to these devotional verses.