Telangana Job Calendar 2024 - Summary
తెలంగాణ లో నిరుద్యోగులకి ఇది శుభవార్త. ఎట్టకేలకు తెలంగాణ జాబ్ క్యాలండర్ ను 2 ఆగస్టు 2024 న శాసనసభలో విడుదల చేశారు డిప్యూటీ సిఎం. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ రానుందని పేర్కొన్నారు. ఈ జాబ్ క్యాలండర్ ద్వారా TS పోలీస్, TGPSC గ్రూప్స్, గురుకుల్, విద్య, వైద్య ఆరోగ్యం,JL, DL, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్లు వంటి ఇతర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుందని ఆయన తెలిపారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలండర్ విడుదల అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. అసెంబ్లీ లో జాబ్ క్యాలండర్ కి చట్టబద్దత కూడా కల్పించనున్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు డిప్యూటీ సిఎం.
అక్టోబర్లో Transco, డిస్కంల ఇంజినీరింగ్, AEE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల తేదీలు, పరీక్షల తేదీలు మరియు నిర్వహణ గురించి ఆభ్యర్ధులకు సరైన సమాచారం కోసం ఈ జాబ్ క్యాలెండర్ దిక్సూచి. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులకు ఇది ఒక సువర్ణఅవకాశం పరీక్షల కోసం ముందునుంచి సన్నద్దమవ్వడంతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ పొందగలరు. Telangana Job Calendar 2024 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు వారి ప్రణాళికని సిద్దం చేసుకుని సన్నద్దమవ్వాలి.
TS Job Calendar 2024 Overview
తెలంగాణ జాబ్ క్యాలండర్ విడుదల | 02 ఆగస్టు 2024 |
ఖాళీల వివరాల సేకరణ | 31 మార్చి 2025 |
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | జూన్ 2025 |
పరీక్షల నిర్వహణ | ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ |
ఫలితాల విడుదల | డిసెంబర్ 2025 |