కృష్ణాష్టమి పూజా విధానం – Krishnashtami Pooja Vidhanam Telugu - Summary
ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి, యశోదలుగా భావించుకుంటూ, తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు, కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజున కృష్ణుని పూజించే వారు అన్ని సుకారాలు అందుకుంటారని ప్రధానంగా నమ్ముతారు. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు.
కృష్ణాష్టమి పూజా విధానం – Krishnashtami Pooja Vidhanam Telugu
కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే, చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో .. అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి, చక్కగా పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి, తులసి మాలని మెడలో వేయాలి.
కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు
కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇక ఎవరి శక్తికొలది వాళ్ళు ప్రసాదాలను తయారుచేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తిని సంతోషిస్తాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి. ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.
You can download the కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam PDF using the link given below. Enjoy and make the most of this wonderful occasion! 🎉