Independence Day Speech in Telugu Telugu PDF

Independence Day Speech in Telugu in Telugu PDF download free from the direct link below.

Independence Day Speech in Telugu - Summary

ఆగస్ట్ 15 సందర్భంగా, విద్యార్థులకు రకరకాల పోటీలు పెడతారు. వాటిలో స్పీచ్ ఒకటి. అంత మంది తోటి విద్యార్థుల ముందు స్పీచ్ ఇవ్వాలని ఉంటుంది, అయితే అది కొంత భయం కలిగిస్తుంది. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే గందరగోళం ఉంటుంది. అందుకే ఈ కథ. ఇందులో విద్యార్థులకు పూర్తి వివరాలతోపాటూ, ఎలా స్పీచ్ ఇవ్వాలో అన్ని వివరాలూ, టిప్స్, ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా, ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము.

Independence Day Speech in Telugu

ఆగస్టు 15కి స్పీచ్ ఇవ్వడం అనేది ఓ గొప్ప అవకాశం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి ఇదో మంచి తరుణం. అందుకే స్కూళ్లలో, కాలేజీల్లో స్పీచ్ కాంపిటీషన్లు నిర్వహిస్తారు. మరి ఈ స్పీచ్ (Independence Day Speech) ఎలా ఇవ్వాలి? స్పీచ్‌లో ఏం మాట్లాడాలి? మొత్తం స్పీచ్ ఎలా గుర్తుంచుకోవాలి? టీచర్లు, విద్యార్థుల ముందు.. ఏమాత్రం టెన్షన్ లేకుండా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం.

Independence Day Speech Telugu tips and ideas :

  • ఈ సింపుల్ టిప్స్ విద్యార్థులు బాగా స్పీచ్ చెప్పేందుకు, బాగా ఎస్సేలు రాసేందుకు ఉపయోగపడతాయి.
  • స్పీచ్‌లో చరిత్ర అంతా చెప్పొద్దు. తేదీలు, నంబర్లు ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. తేలిగ్గా అర్థమయ్యే సింపుల్ పదాల్లో చెప్పాలి.
  • స్పీచ్ ఎవరు ఇచ్చినది సింపుల్‌గా, చిన్న చిన్న డైలాగ్స్‌తో ఉండాలి. మరీ ఎక్కువ సేపు స్పీచ్ ఇస్తే పిల్లలు, విద్యార్థుల విరోధం ఎదుర్కొంటారు.
  • స్పీచ్‌లో ఫ్యాక్ట్స్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవి రాంగ్ చెబితే… మైనస్ మార్కులు వస్తాయి.
  • స్పీచ్ ఇవ్వని ముందు.. ఇంట్లో బిగ్గరగా అరుస్తూ ప్రాక్టీస్ చెయ్యాలి. ఆల్రెడీ ఇస్తున్నట్లు ఫీలవ్వాలి. మొహమాటాన్ని పక్కనపెట్టేయాలి.
  • అద్దం ముందు నిలబడి స్పీచ్ ఇవ్వాలి. విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా ఫీలవుతూ ప్రాక్టీస్ చెయ్యాలి.
  • స్పీచ్ ఇచ్చే వారు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. మీరు చెప్పేది అందరూ వింటున్నారని భావిస్తూ, చెప్పాలనుకున్నది గడగడా చెప్పేయాలి.
  • మీ స్పీచ్‌కి సంబంధించిన పాయింట్లను ఓ పేపర్‌పై రాసుకోవాలి. స్పీచ్ ఇచ్చే ముందు ఓసారి ఆ పాయింట్లు చూసుకుంటే బాగా గుర్తుంటుంది.
  • స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరో ఒకర్నే చూస్తూ చెప్పొద్దు. తలను ఇటూ ఇటూ కదుపుతూ అందరివైపూ చూస్తున్నట్లు స్పీచ్ ఇవ్వాలి.
  • కొంతమంది స్పీచ్ ఇస్తూ ఎవరన్నా చూస్తే, చెప్పాలనుకున్నది మర్చిపోతారు. అలాంటి వారు, ఎవరివైపూ చూడకుండా, కొద్దిగా ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఫేస్ ఉంచి స్పీచ్ ఇవ్వొచ్చు. తద్వారా ఏదీ మర్చిపోరు.
  • మినిమం 5 నిమిషాలు, మాగ్జిమం 10 నిమిషాల్లో స్పీచ్ ఉంటే సరిపోతుంది. లేదా స్కూల్లో ఎంతసేపు ఉండాలని చెప్పారు అనుకుంటే, అంతసేపు ఇవ్వడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి.
  • స్పీచ్‌ని ఓ ఆర్డర్‌లో సిద్ధం చేసుకోవాలి. అంటే బ్రిటీష్ వారు వ్యూహాలు, గాంధీజీ శాంతియుత పోరాటాలు, స్వాతంత్ర్యం సాధించిన విధానం, తర్వాత అభివృద్ధికి అడుగులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు గురించి తెలిపితే మర్చిపోయే అవకాశం ఉండదు.

మీరు (ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, సింపుల్ టిప్స్) Independence Day Speech in Telugu PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ క్రింద ఉంది.

RELATED PDF FILES

Independence Day Speech in Telugu Telugu PDF Download