Durga Durgati Shamani Telugu PDF
Durga Durgati Shamani Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.
దుర్గాదేవి దశభుజాలు, పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది.. అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే. మనలో అట్టి దుర్గాతత్వాన్నిపెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.
ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు. దాని సూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం. అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనే దానికి సంకేతం ఆవిడ వాహనం హంస. అది నీటిని వీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది. ఇంకో పక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక. అట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి. నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్టి బ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.
Durga Durgati Shamani Telugu PDF
దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాఽఽపద్వినివారిణీ |
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ || ౧ ||
దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా || ౨ ||
దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || ౩ ||
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ || ౪ ||
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || ౫ ||
దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ |
నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః || ౬ ||
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః |
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోఽపి వా |
ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః || ౭ ||
ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రమ్ |
You can download the Durga Durgati Shamani Telugu PDF using the link given below.