Small Moral Stories Telugu Telugu PDF

Small Moral Stories Telugu in Telugu PDF download free from the direct link below.

Small Moral Stories Telugu - Summary

A moral story is one that helps you learn an important life lesson. Children enjoy these moral stories and gain valuable lessons from them, such as how to handle rejection and how to deal with fear and more.

Moral stories help in building the ethics and values that aid in developing the spirit of righteousness among children. These stories teach kids the importance of remaining grounded and not straying from the right path due to the lures of greed, envy, or pride.

Moral Stories Telugu

కథలు అనగానే చెవికోసుకుని మరీ వినేవారుండారంటే అతిశయోక్తి కాదు. యీ కథలనేవి ముఖ్యంగా పిల్లల్లో ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని కలిగించి వాళ్ళ మెదడు షార్ప్ గా పనిచేయడానికి దోహదపడతాయి. అందుకే పాఠశాలలో టీచర్స్ స్టూడెంట్స్ కి ఉదాహరణలేమైనా చెప్పదల్చుకుంటే కథల రూపంలోనే ఎక్కువగా చెబుతుంటారు. దాంతో వారిలో జ్ఞాపక శక్తి పెరిగి తెలివితేటలు చురుగ్గా వస్తాయి.

ఇంటి దగ్గర తాతయ్య, నాన్నమ్మలు కథలు చెప్పే రోజులు ప్రస్తుత జనరేషన్ లో మచ్చుకైనా ఎక్కడా కన్పించడం లేదు. ఏ ఇంట్లో చూసినా టి.వి. సీరియల్, సి.డి సిన్మాలు ఆఫీసు ఫైళ్ళ హడావుడే తప్ప పిల్లల కోసం కాస్త టైం కేటాయించి, వారిలో పరనా శక్తిని పెంపొందించడానికి కథలు చెప్పే అలవాటు ఎవరూ చేయట్లేదు. దీంతో వారంతా బిజీ పనుల దావనలో వున్నారు, ప్రైవేట్ ట్యూషన్స్ పట్ల మాత్రమే ఆసక్తి చూపిస్తున్నాయి. కథలు చెప్పడం ద్వారా పిల్లలకు చేరువగా తమ ప్రేమ, వాత్సల్యాలను అందించగలదని గ్రహించలేక పోతున్నారు.. ఇక చదవండి……

తెలివైన తాబేలు:

ఒక అడవిలోని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది.

ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది.

వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది, పైన డొప్ప గట్టిగా తగిలింది.

తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది, ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది.

ఊపిరి బిగపట్టుకొని ఉన్నది, ఇంతలో దానికి ఒక ఉపాయాన్ని తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయట పెట్టింది, అయ్యో నక్క బావ! నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంసమైనా తినలేవు అంది తాబేలు.

ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ: నా శరీరం తీరే అంత నా అక్క బావ, నీటిలోని పైనే గాలి తగిలి గట్టిగా పోతాను, మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో, వెంటనే మెత్తబడతాను. అందుకే, నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి, ఆ తరువాత కడుపారా తినొచ్చు అని చెప్పింది.

అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా. తాబేరు మాటలు నమ్మి నమ్మి అన్నట్టుగానే తల ఊపింది, తాబేలను నీటిలో ఉంచి పారిపోగానీ కాలు నొప్పి పెట్టింది.

కాసేపయ్యాక, తాబేలు తెలివిగా నక్క: బావ, నేను పూర్తిగా నాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నాన్న లేదు అన్నది.

దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.

Small Moral Stories Telugu – కోతి బుద్ధి

ఒక అడవి లో ఒక పెద్ద పండ్ల చెట్లు ఉండేది. దాని మీద ఒక పెద్ద కోతి ఉండేది. దాని కి కోపం చాల ఎక్కువ, అది ఆ చెట్టు మీదకు ఏ పక్షి ని కానీ జంతువు వుని కానీ రావచ్చేది కాదు. అది మాత్రమే ఆ చెట్లు వళ్ళు తినేది, మిగిలిన వాటిని ఎవరినీ తీసనిచ్చేది కాదు.

-ఆ కోతి అంటే ఎవరికి వచ్చేది కాదు. ఒక రోజు ఆ అడవి లో పెద్ద గాలిదుమ్ము వచ్చింది, ఆ వర్గం లో చాలా చెట్లు విరిగి పోయాయి. అలాగే కోతి ఉన్న చెట్లు కూడా విరిగిపోయాయి. యిప్పుడు కోతికి ఎటువంటి ఆశ్రయం లేదు. ఏ జంతువు కోతి కి సహాయం చేయలేదు. అప్పుడు కోతి ఇన్నిరోజులు తాను మిగిలిన జంతువులతో ఎంత తప్పుగా వందో తెలుసుకొని వాటిని మాపం అడిగింది, వారి సహాయం కోరింది. అప్పుడు అన్ని జంతువులు కోతికి సహాయం చేసాయి. అప్పటి నుండి కోతి అందరి తో స్నేహంగా ఉండేది, అందరితో కలసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసు కుంది.

తెలివి తక్కువ తనం

ఒక రాబందు ఒక చిన్న మేక పిల్లను తన రెండు కాళ్లతో పట్టు కొని ఆకాశం లోకి వెళ్లడం ఒక గ్రద్ధ చూసింది. నిజం చెప్పాలి అంటే గ్రద్దను రాబందు కు ఉన్నంత బలం లేదు.

కానీ గ్రద్ద: నేను కూడా రాబందు లాగ నా ఆహారాన్ని నేనే తెచ్చుకుంటాను అనుకుంది. వెంటనే ప్రక్కన ఒక గొర్రెల మంద ఉంది, దాని లో ఒక గొర్రె మీద వెళ్లి వాలింది. అంతలో అక్కడి కి గొర్రెల కాపరి వచ్చాడు. అతనిని చూసి గ్రద్ద ఎగిరిపోవాలి అనుకుంది, కానీ అప్పటికి తన రెండు కాళ్లు గొర్రె బొచ్చు లో కావడంతో అది ఎగర లేక పోయింది.

గొర్రెల కాపరి దానిని తీసుకొని తన పిల్లలు ఆడుకోవడానికి ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆ విధంగా గ్రద్ద తనను తానే ఎక్కువ అంచనా వేసి ప్రాణం మీదకు తెచ్చుకుంది.

You can download the Moral Stories Telugu PDF using the link given below.

RELATED PDF FILES

Small Moral Stories Telugu Telugu PDF Download