Lingashtakam Telugu (లింగాష్టకం) Telugu PDF

Lingashtakam Telugu (లింగాష్టకం) in Telugu PDF download free from the direct link below.

Lingashtakam Telugu (లింగాష్టకం) - Summary


Lingashtakam is a revered devotional stotra dedicated to Lord Shiva, who is also known by names like Maheshwara, Rudra, and Pashupati. Just as the conch shell (Shankha) and the discus (Chakra) symbolize Lord Vishnu, the Linga represents Lord Shiva. The term ‘Linga’ signifies the essence of being, including feminine (Stri Linga), masculine (Pum Linga), and neutral (Napumsaka Linga) forms.

The Lingashtakam Stotram is a heartfelt prayer composed of eight salutations that honor the Supreme Deity in his Linga aspect, symbolizing the creator and the primal source of everything in the universe.

Lingashtakam Lyrics in Telugu with Meaning

లింగాష్టకం

బ్రహ్మమురారিসురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగమ్ |
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ ||

అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్ |
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౨ ||

అర్థం – ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౩ ||

అర్థం – ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౪ ||

అర్థం – ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ |
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౕ ||

అర్థం – ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౖ ||

అర్థం – ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ |
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౭ ||

అర్థం – ఏ లింగము ఎనిమిది రెక్కల పువ్వులను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం [** పరమపదం **]
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౮ ||

అర్థం – ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఆ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాషివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నಿಧౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

అర్థం – లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని (లింగం) దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)

Download Lingashtakam PDF

You can download the Lingashtakam lyrics in PDF format using the direct link below or read it online for free. Enjoy this devotional journey and experience the blessings of Lord Shiva!

RELATED PDF FILES

Lingashtakam Telugu (లింగాష్టకం) Telugu PDF Download