Shyamala Devi Pooja Vidhanam Telugu PDF
Shyamala Devi Pooja Vidhanam Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.
శ్యామలా ఉపాసన అనేది దసమహావిద్య లో ఒకవిద్య ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు..దసమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దసమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దసమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన వన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవారాత్రి ని విశేషంగా జరుపుకుంటారు..
విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు
Shyamala Devi Pooja Vidhanam Telugu PDF
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ శ్యామలా దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా వాక్ స్తంభనాది దోష నివారణార్థం, మమ మేధాశక్తి వృద్ధ్యర్థం, శ్రీ శ్యామలా దేవతా ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితా భవ స్థాపితా భవ |
సుప్రసన్నో భవ వరదా భవ |
స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |
అస్మిన్ బింబే శ్రీశ్యామలా దేవతామావాహయామి స్థాపయామి పూజయామి |
ధ్యానం –
ధ్యాయేయం రత్నపీఠే శుకకలపఠితం శృణ్వతీం శ్యామలాంగీం
న్యస్తైకాంఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీం వాదయంతీమ్ |
కహ్లారాబద్ధమాలాం నియమితవిలసచ్చోలికాం రక్తవస్త్రాం
మాతంగీం శంఖపాత్రాం మధురమధుమదాం చిత్రకోద్భాసిభాలామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ధ్యాయామి |
ఆవాహనం –
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
సహస్రదళపద్మస్థాం స్వస్థాం చ సుమనోహరామ్ |
హరిబ్రహ్మేంద్రనమితాం తాం భజే జగతాం ప్రసూమ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ఆవాహయామి |
ఆసనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా |
ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః నవరత్న ఖచిత సువర్ణసింహాసనం సమర్పయామి |
పాద్యం –
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
శుద్ధగంగోదకమిదం సర్వవందితమీప్సితమ్ |
పాపేధ్మవహ్నిరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం
జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
పుష్పచందనదూర్వాదిసంయుతం జాహ్నవీజలమ్ |
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o
శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యే-
-ఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
పుణ్యతీర్థాదికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా |
గృహ్యతాం శివకాంతే చ రమ్యమాచమనీయకమ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
కాపిలం దధి కుందేందుధవళం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం –
పంచామృతం మయానీతం పయో దధి ఘృతం మధు |
శర్కరాది సమాయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |
స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో
వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు
మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
సుగంధి విష్ణుతైలం చ సుగంధామలకీజలమ్ |
దేహసౌందర్యబీజం చ గృహ్యతాం శ్రీహరప్రియే ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
వస్త్రం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
సౌందర్యముఖ్యాలంకారం సదా శోభావివర్ధనమ్ |
కార్పాసజం చ క్రిమిజం వసనం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
ఆభరణం –
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
రత్నస్వర్ణవికారం చ దేహాలంకారవర్ధనమ్ |
శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ఆభరణాని సమర్పయామి |
గంధం –
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
మలయాచలసంభూతం వృక్షసారం మనోహరమ్ |
సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః గంధం సమర్పయామి |
పుష్పాణి –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
నానాకుసుమనిర్మితం బహుశోభాప్రదం పరమ్ |
సర్వభూతప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః పుష్పాణి సమర్పయామి |
అథ అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావళిః పశ్యతు |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి |
ధూపం –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
వృక్షనిర్యాసరూపం చ గంధద్రవ్యాదిసంయుతమ్ |
ధూపం దాస్యామి కల్యాణి పవిత్రం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
జగచ్చక్షుః స్వరూపం చ ప్రాణరక్షణకారణమ్ |
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
నానోపహారరూపం చ నానారససమన్వితమ్ |
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ||
తాంబూలం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదిసువాసితమ్ |
జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”-
-న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
కర్పూరదీపతేజస్త్వం అజ్ఞానతిమిరాపహా |
దేవీప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః నీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం –
ఓం శుకప్రియాయై విద్మహే శ్రీకామేశ్వర్యై ధీమహి తన్నః శ్యామా ప్రచోదయాత్ ||
సద్భావపుష్పాణ్యాదాయ సహజప్రేమరూపిణే |
లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి ||
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ-
-హస్తే నమస్తే జగదేకమాతః ||
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ||
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
సర్వోపచారాః –
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః గజానారోహయామి |
యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |
దేవభూపార్హ భోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ||
అనయా మయా కృతేన శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీశ్యామలాదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం మాతృపాదోదకం శుభం ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
విసర్జనం –
ఇదం పూజా మయా దేవి యథాశక్త్యుపపాదితామ్ |
రక్షార్థం త్వం సమదాయ వ్రజస్థానమనుత్తమమ్ ||
ఓం శ్రీశ్యామలాదేవ్యై నమః యథాస్థానముద్వాసయామి |
You can download the Shyamala Devi Pooja Vidhanam Telugu PDF using the link given below.
