నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu

మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః

దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.

Navratri Puja Vidhi Telugu (నవరాత్రి పూజా విధానం)

ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్ధం , శ్రీ పార్వతీ ప్రసాద సిత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే దక్షిణానే , శరద్ రుతౌ , ఆశ్వీయుజ మాసే , శుక్ల పక్షే (ఈరోజు తిథి) తిథౌ శుభ వాసరే శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాం సర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

You can download the Navratri Puja Vidhi Telugu PDF using the link given below.

2nd Page of నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu PDF
నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu

నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.