Mission Vatsalya Application Form

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Mission Vatsalya Application Form

చాలా మందికి పేద‌రికం ఓ స‌మ‌స్య‌. కొంత మంది త‌ల్లిదండ్రులు లేక‌, మ‌రికొంత మంది ఎవ‌రూ లేక అనాథ‌లుగా పెరుగుతున్నారు. కేవ‌లం పరామ‌ర్శ‌ల‌కు వెళ్లి ఫొటోల‌కు పోజులిచ్చే నాయ‌కులు సైతం తాత్కాలిక సాయాన్ని మాత్ర‌మే అందించ‌గ‌ల‌రు. మ‌రీ త‌ర్వాత వారి ప‌రిస్థితి ఏంటి అంటే. ఒక్క‌రి నుండి స‌మాధానం ఉండ‌దు. స‌మాజంలో జాలి మాత్ర‌మే చూపించే రోజులు. ఆర్థికంగా ఆదుకోవాలంటే ఆలోచించాల్సిందే. ఇలాంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే ఓ ప‌థ‌కం ఇది. అనాథలు, నిస్సహాయ స్థితిలో ఉన్న బాలబాలికలకు ఆరోగ్యంతో పాటు ఆర్ధికభరోసా కల్పించేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి.

ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రతినెలా రూ.4 వేలు అందజేస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం ఈ ప‌థ‌కం నిర్వాహ‌ణ చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ.2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.

Mission Vatsalya Application Form – Eligibility Creteria

  • వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు
  • అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాధ బాలలు
  • ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు
  • ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు
  • బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/వేదింపులకు/దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
  • PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు
  • తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
  • పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
  • బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
  • కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.

Required Documents For Mission Vatsalya Scheme ?

  • బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
  • తల్లి ఆధార్ కార్డు
  • తండ్రి ఆధార్ కార్డు
  • తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము, మరణ కారణము
  • గార్డియన్ ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రము
  • బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
  • స్టడీ సర్టిఫికేట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రము
  • బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.

You can download the Mission Vatsalya Application Form PDF using the link given below.

Mission Vatsalya Application Form PDF Free Download

REPORT THISIf the purchase / download link of Mission Vatsalya Application Form PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES