క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం | Ksheerabdi Dwadasi Pooja Vidhanam Telugu PDF
Ksheerabdi Dwadasi falls after the Ekadashi and it is one of the most significant days in the Panchang which played a very vital role in Hinduism. This fast is a very well remedy for those who are facing various types of problems in their life.
Many people do Parana of their Ekadashi Vrat for the successful completion of the Ekadashi fast. If you want to observe the Ksheerabdi Dwadasi for the wellness of your family. If you want to do this Vrat then observe it with proper Pooja Vidhanam.
క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం | Ksheerabdi Dwadasi Pooja Vidhanam in Telugu
ఆషాడ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు(ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణాలు వచనం. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేసినయెడల దీర్ఘసౌమంళిత్వం ప్రాప్తించి సుఖసంపదలు, ఐశ్వరం కలుగుతాయని స్మృతికౌస్తుభం పేర్కొన్నది.
క్షీరాబ్ది ద్వాదశి.. కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. దేవదానవులు క్షీరసాగరాని మదిచిన రోజు కాబట్టి… ఈ రోజుని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అని పిలుస్తారు. ఈ రోజంటే శ్రీమహావిష్ణువుకి ప్రీతి. అందుకే.. లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగుపెడతాడు. బృందావనం అంటే తులసి. తులసి అంటే.. లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూమైన ఉసిరి మొక్కని ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ.. శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే.. తగిన ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వరాలు ప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తున్నాయ్.
క్షీరాబ్ధి ద్వాదశి పూజ – క్షీరాబ్ధి శయన వ్రత విధానం
శ్రీ పసుపు గణపతి పూజ:
శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
- ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
- మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
- వామనాయ నమః, శ్రీధరాయ నమః,
- ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
- దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
- వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
- అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
- అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
- అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
- ఉపేంద్రాయ నమః, హరయే నమః,
- శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||
- శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
- వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
- అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
- నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
- అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
Ksheerabdi Dwadasi Pooja Vidhanam
You can download Ksheerabdi Dwadasi Pooja Vidhanam PDF by clicking on the following download button.