Jammi Chettu Slokam in Telugu - Summary
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . ‘శ్రవణా’ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి “విజయ”అనే సంకేతమున్నది .
అందుకనే దీనికి ‘విజయ దశమి’ అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .’చతుర్వర్గ చింతామణి ‘అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే ‘విజయం ‘ అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .
Jammi Chettu Slokam in Telugu (Sami Vruksha Prarthana)
(దశమ్యాం సాయాహ్నే శమీపూజాం కృత్వా-తదనంతరం ధ్యాయేత్)
శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని || ౧ ||
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీమ్ |
ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీమ్ || ౨ ||
నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే |
త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ || ౩ ||
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది |
పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ || ౪ ||
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీమ్ |
దుఃస్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభామ్ || ౫ ||
శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఇది సాధారణంగా అడవుల్లోను, ఆలయాల వద్ద, మైదానాల్లోను, పొలాల గట్ట వెంబడి కనిపిస్తూ ఉంటుంది. అనేక వృక్ష సంతతుల మాదిరిగానే ఇది కూడా ఒక ఔషద విలువలు కలిగిన చెట్టు. ఆయుర్వేదంలో చర్మసంబంధ వ్యాధులకు మందుగా జమ్మిచెట్టు ఆకులు, బెరడు వినియోగిస్తారు.