BRS Manifesto 2023 - Summary
BRS Manifesto 2023 PDF : తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్ధంచేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నం. వెనుకబడేయబడ్డ తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలె – ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నం. బడ్జెట్ ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకపోయినం. జీఎస్టీపీ రెండున్నర రెట్లు పెంచినం. తలసరి ఆదాయం పెంచినం. సంక్షేమానికి – అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చినం. సంక్షేమంలోనూ, క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
BRS Manifesto 2023 – Highlights
కేసీఆర్ బీమా :
- రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు కేసీఆర్ బీమా ఆరోగ్య పథకం
- ‘కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా’గా పేరు ఖరారు
- ఐదు లక్షల రూపాయలతో బీమా
- వందశాతం ప్రిమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం.
- రైతుబంధును రూ.16 వేలు చేస్తాం.
- ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016కి పెంపు. ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెంపు.
- సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి.
- తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.
- దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం.
- కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
- గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
- గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం.
- తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం.
- బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం.
- రైతుబీమా తరహాలోనే పేదలకు కేసీఆర్ బీమా పథకం.
- తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా.
- అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.
- తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం.
రైతుబంధు సాయం పెంపు:
- రైతుబంధు సాయం పెంపు
- ఎకరానికి ఏటా రూ. 10 వేలు ఇస్తుండదా… మళ్లీ అధికారంలోకి రాగానే రూ. 12వేలకు పెంపు.. దశల వారీగా రూ.16వేలకు పెంచుతారు.
మహిళలకు 3వేల భృతి:
- అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ. 3వేల జీవన భృతిని అందజేత.
రూ. 400లకే గ్యాస్ సిలిండర్:
- అర్హులైన పేద మహిళలకు రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ అందజేత. మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
You can download the BRS Manifesto 2023 PDF using the link given below.