Dasara Pooja Vidhanam Telugu

Dasara Pooja Vidhanam Telugu PDF download free from the direct link given below in the page.

1 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Dasara Pooja Vidhanam Telugu PDF

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే అంటే విజయదశమి లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలో శుక్ల పక్షంలో దశమి తిథి నాడు అంటే అక్టోబర్ 5వ తేదీ బుధవారం నాడు దసరా పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ పర్వదినాన శ్రీరాముడు లంకాధిపతి రావణుడిని వధించాడని, దుర్గా మాత మహిషాసురుడిని సంహరించిందని నమ్ముతారు. అందుకే ఈ పండుగను విజయదశమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ రోజునే రావణుడితో పాటు మేఘనాథ్, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇదే రోజున దుర్గాపూజ కూడా ముగుస్తుంది. ఈ సందర్భంగా దసరా పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

Dussehra festival is considered as the victory of truth over falsehood. That is why Durga Puja, Rama Puja and Shami Puja are performed today. On this auspicious day special worship is done to the idol of Goddess Durga.

Dasara Pooja Vidhanam in Telugu

సాధారణంగా హిందూ మతంలో పండుగలన్నీ ఉదయం వేళలో జరుపుకుంటారు. అయితే దసరా పండుగ రోజున మధ్యాహ్నం వేళలో పూజలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజున ఈశాన్య మూలలో తామర రేకులను ఉంచి, అష్ఠదళాల మధ్యలో అపరాజితాయ నమః అనే మంత్రాన్ని పఠించి దుర్గా మాతను, శ్రీరాముడిని పూజించాలి. అనంతరం అమ్మవారికి కుంకుమ లేదా ఎరుపు రంగు, అక్షింతలు, పువ్వులు నైవేద్యంగా పెట్టి భోగాన్ని సమర్పించాలి. చివరగా అమ్మవారికి హారతి ఇవ్వాలి.

దసరా పండుగ రోజున మగాళ్లు మన్యానికి వెళ్లి మరీ పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అప్పటినుంచి ఈ సంప్రదాయం ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోందని పెద్దలు చెబుతారు. అదే విధంగా దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించాలి. పాలపిట్టను దర్శించుకుంటే మనం చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ పాలపిట్ట కూడా నీలం, పసుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటుంది. సాంస్కృతికంగా, పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టను చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు.

దసరా నైవేద్యములు

  1. పాడ్యమి రోజు  శ్రీ దుర్గాదేవి  –  చలిమిడి, వడపప్పు, పాయసం
  2. విదియ రోజు  శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు
  3. తదియ రోజు  శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర
  4. చవితి రోజు  శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి
  5. పంచమి రోజు  శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు
  6. షష్టి రోజున  శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం
  7. సప్తమి రోజు  శ్రీ సరస్వతి దేవి  (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం
  8. అష్ఠమి రోజు  శ్రీ దుర్గాదేవి  (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
  9. నవమి రోజు  శ్రీ మహిషాసురమర్ధిని  (మహర్నవమి) చక్రపొంగలి
  10. దశమి రోజు  శ్రీ రాజరాజేశ్వరీదేవి  (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు

You can download the Dasara Pooja Vidhanam PDF using the link given below.

Download Dasara Pooja Vidhanam PDF

REPORT THISIf the purchase / download link of Dasara Pooja Vidhanam PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • Mysore Dasara 2023 Program List

    If you need to download the Mysore Dasara 2023 Program List PDF then you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this page. In this PDF you can check the Mysoredasara Program List date with place 2023....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *