సిలువలో పలికిన ఏడు మాటలు Telugu PDF

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

సిలువలో పలికిన ఏడు మాటలు in Telugu

On the Day of Good friday Christians pray to Jesus Christ for their bright future. ఈ లోకంలో చాలామంది వారు చనిపోయేముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలి అనుకుంటారు. చనిపోయేముందు వారికి సమయం దొరికితే ఆ బెడ్ మీదనుండే వారి జీవితములో ఎవరికైనా అపకారం చేస్తే వారిని క్షమాపణ అడగడం, కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని మెరుగుపరచుకోవడం చేస్తుంటారు.

కానీ మనలో చాలా మందికి అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో, ఎలా మరణిస్తామో మన చేతుల్లో లేదు. అందుకే చివరి మాటలు వినే అవకాశము వస్తే, వాటికి ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారు.

సిలువలో పలికిన ఏడు మాటలు

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.
“వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను హింసింప చేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి” (లూకా 23:33).
(యెషయా 52:14; 50:6)
I.    మొదటి మాట – క్షమాపణ, లూకా 23:33-34; I పేతురు 3:18; I కొరిందీయులకు 15:3.
II.   రెండవ మాట – రక్షణ, లూకా 23:39-43; అపోస్తలుల కార్యములు 16:31.
III.  మూడవ మాట – మమకారము, యోహాను 19:25-27; అపోస్తలుల కార్యములు 2:47.
IV.  నాల్గవ మాట – ఆవేదన, మత్తయి 27:45-46; I తిమోతి 2:5.
V.   ఐదవ మాట – శ్రమ, యోహాను 19:28-29; యెషయా 53:5.
VI.  ఆరవ మాట – నెరవేర్పు, యోహాను 19:30; హెబ్రీయులకు 10:10;
హెబ్రీయులకు 10:14, 11-12.
VII. ఏడవ మాట – దేవునికి అప్పగించుకొనుట, లూకా 23:46; లూకా 2:49; 23:47;
మార్కు 15:39; అపోస్తలుల కార్యములు 16:31; యోహాను 14:6.

సిలువలో పలికిన ఏడు మాటలు సాంగ్ లిరిక్స్ – గుడ్ ఫ్రైడే సాంగ్ లిరిక్స్

సిలువలో పలికిన ఏడు మాటలు
పరదైసుపురం లో చేర్చు ప్రేమ బాటలు
మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం
ముళ్ల మకుటధారి నీకు వందనం || సిలువలో ||

నిన్ను చంపు నీ శత్రువులే నీ ముందర నిలవగా
ఈటెలు కొరడాలతో, హింసిస్తూ ఉండగా
తండ్రి వీరందరూ ఏమి చేయుచుంటిరో వీరెరుగరు
వీరిని క్షమించమని పలికితివి (2). || మా రక్షణ కర్త ||

యేసు నీ రాజ్యముతో నీవు వచ్చునప్పుడు
తప్పక నన్ను చేర్చమని సిలువ దొంగ వేడగా
నేడు నీవు నాతోనే – పరదైసున నుందువు అని పలికి
ఆ దొంగను రక్షించియుంటివి (2). || మా రక్షణ కర్త ||

కన్న తల్లి మరియు యోహానుని చూపించి
అమ్మ ఇదిగో నీకుమారుడని యంటివి
తల్లికాదరణగా యోహానును ఏంచుకొని
ఇదిగో నీ తల్లియని – బాంధవ్య మోసగితివి (2). || మా రక్షణ కర్త ||

తనువునెల్ల గాయాలు తల్లడిల్ల జేయగ
తండియే యెడబాసెనని కడుదూరమాయెనని
నాదేవ నాదేవ నన్నెందుకు వీడితివని పలికి
నీ వేదన నీవేదించుకుంటివి (2). || మా రక్షణ కర్త ||

సకల సంపద నీలో గుప్తమై యున్నవి
జీవ జలహారముతో జీవుల పోషించితివి
దప్పికగొను చున్నాను అని – అప్పగిచిని పలికితివా
చేదు చీరికనే నీకు – తెరవమని ఇచ్చిరా (2). || మా రక్షణ కర్త ||

లేఖనములు నీయందే నెరవేరియున్నవి
పాప శాప భారములు వీపున భరించితివి
నీ గాయములు మాకు నిజమైన స్వస్థతలు
‘సమాప్తము’ అయినదని ఎలుగెత్తి చాటితివా (2). || మా రక్షణ కర్త ||

అద్వితీయ కుమారుడా అధికశక్తినొందితివి
ఆత్మతో సత్యముతో తండ్రిని ఘనపరిచితివి
తండ్రీ! నా ఆత్మను నీకు అప్పగింతునంటివి
నీ అంతట నీ ఆత్మను అర్పించితివి (2). || మా రక్షణ కర్త ||

సిలువ యాగ సమయాన సర్వ సృష్టి సడలినది
అవని దద్దరిల్లినది గుడి తెరియచీలినది
సమాధుల నున్నవారు – తిరిగి లేచి నడిచిరి
రవితేజము సన్నగిల్లే – సిలువ వెలుగు ప్రజ్వరిల్లే (2)

మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం
ముళ్ల మకుటధారి నీకు వందనం (2)

You can download the సిలువలో పలికిన ఏడు మాటలు PDF using the link given below.

2nd Page of సిలువలో పలికిన ఏడు మాటలు PDF
సిలువలో పలికిన ఏడు మాటలు

సిలువలో పలికిన ఏడు మాటలు PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of సిలువలో పలికిన ఏడు మాటలు PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If సిలువలో పలికిన ఏడు మాటలు is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version