Telugu Rasi Phalalu 2022 to 2023 Telugu

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Telugu Rasi Phalalu 2022 to 2023 in Telugu

Hello, Friends today we are sharing Telugu Rasi Phalalu 2022 to 2023 PDF to help all of you. If you are searching Telugu Rasi Phalalu 2022 to 2023 in the Telugu language then you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this page.

Telugu Rasi Phalalu 2022 to 2023 Calendar contains Rasi Phal, Shubh Muhurt, Festivals, Vrats, and holidays and this panchang provides all types of information to users. శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు ఏకాదశ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు దశమ స్థానమగు మకరరాశియందు వక్రముగా సంచారము – 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు పునః కుంభరాశియందు ఏకాదశ స్థానమున శని సంచారము.

Telugu Rasi Phalalu 2022 to 2023 – నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు గ్రహముల బలముచే ఆరోగ్యము బాగుగాయుండును.
విద్యా వ్యాపార ఉద్యోగ పదవులందు అభివృద్ధితో ధనముతో యుందురు, చిన్న చిన్నవైరములు కూడా రావచ్చును. ధనయోగముచే కొన్నిసార్లు ఇబ్బందులు అనుభవిస్తారు.పాత బాకీలు కొన్ని తీర్చగలరు. సూర్యుని యొక్క ఈ నెలయందు ఆదివారము రోజున27 సార్లు ప్రదక్షణములు చేస్తే మనోవాంఛలు అనుకూలిస్తాయి.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు దురాశతో చేసే పనులు వికటిస్తాయి. వృత్తియందు కలతలు పొందుతారు. భార్యాభర్తలు ఆనందముతో యుండుట మంచిది. పాత బాకీలు కొన్ని తీర్చెదరు.ప్రయాణములు తగ్గించుట మంచిది. ఇంటియందు నేత్ర బాధలు వస్తాయి. ఉద్యోగములందు ధనాదాయము బాగుగాయుండును. అంగారునకు మంగళవారము 11 ప్రదక్షణములు చేసి కందులు కొన్ని దానము బ్రాహ్మణులకు ఇస్తే మీ సంతాన సమస్యలు తీర్చగలరు.

2022 మార్చి – ఈ నెలయందు ఆర్ధిక లావాదేవీలు అనుకూలము. దూర ప్రయాణములు చేస్తారు. ప్రణాళిక ప్రకారము నడచుట మంచిది. ఇంటియందు చికాకులు రావచ్చును. ఈ నెలయందు కొంచెము రుణములు చేయవచ్చును. విలువైన వస్తువులు ఖరీదులు చేస్తారు. కొన్ని నష్టములు కూడా రావచ్చును. వృత్తి వ్యాపారాదులందు ఆలోచనలు అధికము. స్థిరాస్థి వలన సమస్యలు అధికము. అందుచే శనివారము రోజున శని గ్రహమునకు 27 ప్రదక్షణములు చేసి 1/2 కేజి నువ్వులు దానము ఇస్తే శని దోషము పోయి ఆనందాన్ని పొందుతారు.

2022 ఏప్రియల్ – ఈ నెలయందు ఉద్యోగములో ఉన్నత స్థితి ఉంటుంది. వ్యాపారములో అధిక లాభాలు వస్తాయి. మిత్రులతో కలసి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కుటుంబ సభ్యుల మేలు అనుకూలము. గృహ భూ వాహన యోగములు ఉన్నాయి. ఇష్టదేవతను స్మరించండి. వ్యాపార ఉద్యోగ వృత్తి సామాన్య జనుల బాధలు కొన్ని తొలగిపోగలవు. అందుచే దుర్గాదేవి కి కుంకుమ పూజ, ప్రదక్షిణములు 21 శుక్రవారము చేస్తే ఆరోగ్యము బాగుగా ఉంటుంది.

2022 మే – ఈ మాసమునందు సామాన్య ధనప్రాప్తి కొన్ని విషయములు అనుకూలము. కొన్ని వ్యవహారములు వేధించును. బంధుజన మృతులు అధికము. తరచు ప్రయాణములు చేస్తారు. పిల్లల వివాహ బంధములు చదువులు కొన్ని ఇబ్బందులు చేస్తాయి. సామాన్య యోగము ఈ నెలయందు నడుచును. శ్రీకాళహస్తి వెళ్ళి దేవుని దర్శించుకొనుట మంచిది. గొప్ప అవకాశాలు వస్తాయి.

2022 జూన్– ఈ నెలయందు ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది. దైవ నిర్ణయాలు చేసి కార్యక్రమములు ప్రారంభించండి. వృత్తియందు వ్యాపారము నందు చేతి వృత్తుల యందు కొంచెము వడిదుడుకు పనులు జరుగుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి మీ పనులు సాగుతాయి. పట్టు విడుపులు అవసరము. ప్రశాంత జీవనము లభిస్తుంది. బుధవారం రోజున బుధ గ్రహ పూజలు చేసి 21 ప్రదక్షణములు చేస్తే పెసలు దానము ఇస్తే కార్యములన్నియునూ పూర్తికాగలవు. సందేహమే లేదు.

2022 జూలై– ఈ నెలయందు గ్రహ స్థితి అనుకూలము. రాజకీయ వ్యవహారములు జయము. వృత్తి ఉద్యోగములందు సంతృప్తి కలుగును. స్త్రీ మూలకంగా కలహములు వచ్చును. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్థాయి. అదృష్ట కాలము నడుస్తుంది. పెద్దల సహకారము అందుతుంది. ఈ నెలయందు లక్ష్మీ స్థుతి మేలునిచ్చును. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు చేయగలరు. వ్యాపారబలము బాగుగాయున్నది. జాగ్రత్త వహించుట మంచిది.

2022 ఆగష్టు– ఈ నెల యందు శుభ కాలం. కొన్ని పనులు ఆటంకములు వస్తాయి. పిల్లల చదువులు అనుకూలము. అన్ని పనులూ సాగిపోతాయి. ధనము కొరకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొహమాటము ప్రక్కకు పెట్టి కార్యదీక్షతో ముందుకు సాగుము. శ్రీ రామనామం జపము ముఖ్యము. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు తగిన లాభాదులు పొందగలరు. ఆరోగ్యము బాగుగాయుండును. పెద్దల ఆరోగ్యము తరచుగా బాధించును. ధనవ్యయము అధికముగా చేయగలరు.

2022 సెప్టెంబర్ – ఈ నెలయందు ప్రతి పనిని కూడా ఆలోచించి చేయండి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని సాధించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురు వస్తాయి. తోటివారి సహాయము అనుకూలము. మిత్రుల సహాయముతో ధనాన్ని సేకరిస్తారు. గృహలాభయోగములు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా తగు జాగ్రత్తలు అవసరము. దూర ప్రయాణములు చేస్తారు. నవగ్రహముల స్తోత్రము చదవండి. కొన్ని శుభాలు కలుగుతాయి. మనము చేయు పనిలో ఆనందమును అనుభవించెదరు.

2022 అక్టోబర్ – ఈ నెలయందు ప్రతి వ్యవహారమునందు సత్ఫలితము కలుగును. ఆర్ధికంగా కొంత మేలు లభించును. అసలు ధనము వస్తుంది. రావలసిన బాకీలు వస్తాయి. దగ్గరవారితో విరోధములు వస్తాయి. అందుచే శ్రీ వెంకటేశ్వర గుడికి వెళ్ళి ప్రదక్షణములు గాయించి సంతృప్తి పొందండి. ఇంటియందు భార్యా పిల్లలు ఆనందముగాయుంటారు. ధనము వృత్తియందు ఉద్యోగములందునూ చేతి వృత్తులయందు బాగుగానే వస్తాయి. దూర ప్రయాణములు చేయుట మంచిది.

2022 నవంబర్ – ఈ నెలయందు ఆర్ధిక అంశాలు బాగుగాయున్నాయి. సంకల్పము సిద్ధి బాగుగాయున్నది. శ్రేష్ఠమైన ఫలితములు వస్తాయి. ఆరోగ్యము బాగుగాయుంటుంది. ఉద్యోగములో ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదవీ లాభాలు కొన్ని వస్తాయి. గురుధ్యానము చేయండి. విద్యా సంబంధిత పనులు పూర్తియై విజయము సాధించెదరు. కోర్టు మున్నగు వ్యాపారములు అనుకూలిస్తాయి.

2022 డిసెంబర్ – ఈ నెలయందు ధనలాభముంది. కీర్తి పెరుగుతుంది. లక్ష్య సిద్ధిని సాధించెదరు. ఉద్యోగ పరంగా స్వల్ప శ్రమ తప్పదు. వారాంతములో శుభాలు వింటారు. పిల్లల చదువులు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లలు బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించవచ్చును. జీవిత సాఫల్యము ఆలోచించాలి. వృత్తి ఉద్యోగ పనులు సక్రమముగా నడచును. ఈ నెలయందు శ్రీశైల దేవుని దర్శించుకొనుట మంచిది. కొన్ని శుభములు కలుగుతాయి.

You can download the Telugu Rasi Phalalu 2022 to 2023 PDF using the link given below.

Telugu Rasi Phalalu 2022 to 2023 PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Telugu Rasi Phalalu 2022 to 2023 PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Telugu Rasi Phalalu 2022 to 2023 is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version