Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు) Telugu PDF

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు) in Telugu

గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం.ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.

శ్రీమహావిష్ణువు గరుడ కల్పంలో గరుడుడు ఉద్భవించిన విషయ వివరణ చేస్తూ బ్రహ్మాండ ఆరంభం దగ్గర నుంచి గరుడునికి వివరించిన పురాణం కాబట్టి దీనికి గరుడ పురాణమనే పేరు వచ్చింది. ఇందులో 264 అధ్యాయాలు 18వేల శ్లోకాలు ఉన్నాయని నారద పురాణం తెలుపుతున్నది. ఇది రెండు ఖండాలుగా ఉన్న పురాణం. పూర్వఖండంలో లౌకిక ఉపయోగానికి అవసరమైన సమస్త విద్యల వివరణ విస్తృతంగా ఉన్నది. పురాణ ప్రారంభం లోనే విష్ణువు ఆయన అవతారాల మాహాత్మ్యం గురించి తెలియజేయబడింది. దీనిలోని ఒక అంశంతో అనేక రకాల రత్నాల పరీక్ష , అలాగే ముత్యము (69 అధ్యాయం) పద్మరాగం (70వ అధ్యాయం) మరకత, ఇంద్రనీల, వైడూర్య , పుష్పరాగ, కరకేతన, భీష్మరత్న , పులక, రుధిరాఖ్య రత్నాలు, స్ఫటికము, విదృమ పరీక్షలు (71 నుంచి 80 అధ్యాయాల వరకు) తెలుపబడ్డాయి. ఇందులో రాజనీతి (108- 115 అధ్యాయాల వరకు) కూడా బాగా విస్తృతంగా వివరించబడింది. ఆయుర్వేదము యొక్క ఆవశ్యకత, రోగనిధానము, చికిత్సా విధానములను గురించి (15 నుండి 181 అధ్యాయాల వరకు) అనేక అధ్యాయాలలో వివరించబడింది. అనేక రకాల రోగాలను పోగొట్టడానికి ఔషధ విధానం (170-196వ అధ్యాయం వరకు) చెప్పబడింది. ఇది చాలా ప్రశంసనీయ విషయం. ఇంకొక అధ్యాయం (199) మనస్సును నిర్మలంగా ఉంచుకొనటానికి ఔషధాలను నిర్దేశించింది. ఆయుర్వేదాన్ని ప్రతిపాదించే ఈ 50 అధ్యాయాలు వేరు పుస్తకంగా ప్రకటించి, ఇతర ఆయుర్వేద గ్రంథాలలాగా దీనిని కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఛందశాస్త్ర విషయాలు (211 -216) అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. సాంఖ్య యోగాన్ని గురించి విపులంగా 14(230-243) అధ్యాయాలలో వివరించబడింది. ఒక అధ్యాయం (242)లో గీతా సారాంశం ఉన్నది. ఈ విధంగా గరుడపురాణం ఈ పూర్వాంశం అగ్ని పురాణం వలెనే సమస్త విద్యలకు విజ్ఞాన కోశంగా చెప్పవచ్చును.

Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు)

నారదపురాణం, మత్స్యపురాణాలలో గరుడ పురాణ విషయాలుగా చెప్పబడినవి. యథాతథంగా లభ్యం అవుతున్నాయి. ప్రస్తుతం లభ్యం అవుతున్న గరుడ పురాణంలో ఏడువేల శ్లోకాలు ఉన్నాయి. లభ్యం అవుతున్న గరుడ పురాణంలో శ్లోకసంఖ్య తక్కువగా ఉన్నా, చెప్పబడిన విషయాలు మాత్రం కొరత లేదు. ఇందులోని భవిష్య రాజవంశాఖ్యానాన్ని చదివితే ఇది జనమేజయుని కాలంలో సంకలింపబడినట్లు తెలుస్తుంది. మత్స్య, విష్ణు పురాణాలలోని భవిష్యరాజ వంశాఖ్యాన వృత్తాంతాలలో ఆంధ్ర, గుప్త రాజవంశాలు పేర్కొనబడ్డాయి. కానీ ఇందులో ఆ వృత్తాంతాలు లోపించటంవలన, ఇది ఆ పురాణాలకంటే ప్రాచీనమని భావించటం సమంజసంగా ఉంటుంది.

శూద్రక మహారాజు కాలంలో బౌద్ధ హిందూ ధర్మాలు కలసిపోయాయి. ఆ సమయంలో బౌద్ధమతము, బుద్ధుని ఆరాధన మనదేశంలో ఎక్కువగా ఉండేది. అందువలననే బుద్ధుడు విష్ణువు యొక్క 21వ అవతారంగా పేర్కొనబడ్డాడు. ఇందులో ఋద్ధుని తండ్రి ఆయన వంశం (శుద్ధోధకో రాహులశ్చ సేనజత్ శూద్రక్తసథా) స్పష్టంగా చెప్పబడ్డాయి.

You can download the Garuda Puranam Telugu PDF using the link given below.

2nd Page of Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు) PDF
Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు)

Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు) PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు) PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Garuda Puranam Telugu ( గరుడ పురాణం ఇన్ తెలుగు) is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version