Bathukamma Songs Telugu PDF

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Bathukamma Songs in Telugu

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు ప్రీతి పాత్రమైనది. భగవంతున్ని పూలతో పూజించడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచారం అయితే ఆ పూలనే భగవంతునిగా పూజించడం తెలంగాణ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను చాటేదే మన బతుకమ్మ పండుగ. ఆ విశిష్ట సంస్కృతిని తరతరాలుగా బతికిస్తూ వస్తున్నది మన ఆడబిడ్డలే. బతుకమ్మ పండుగ అంటేనే పూలు, పాటలు, పడతులు.

బతుకమ్మ పాటలన్నీ అజ్ఞాత మహిళలచే అశువుగా అల్లబడినవి. రాగయుక్తమైన శైలి, సరళమైన భాషతో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైన పాటలివి. బతుకమ్మ పాటల్లోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, ఇతిహాస, చారిత్రాక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటల ప్రధాన వస్తువులు, బతుకమ్మ పాటల్లో అమూల్యమైన చరిత్రకు గల మౌఖిక ఆధారాలతో పాటు అద్భుతమైన వ్యంగ్యం కలిగించే అర్థం అడుగడుగునా కనిపిస్తాయి. ఈ పాటలను సేకరించడం మార్పులకు తావులేకుండా వాటిని జానపదులకే సొంతమైన సహజశైలిలోనే భద్రపరచడం ఇప్పటి అవసరం. వాటిని అక్షరబద్ధం చేసి పాడుకోవడానికి ఉపయుక్తంగా ఉండేట్టు ఇప్పుడు పుస్తకరూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం.

Bathukamma Songs Lyrics

ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే

తంగేడు పువ్వులో తంగేడు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (1)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

తెలుగంటి పువ్వోప్పునే గౌరమ్మ తెలుగంటి కాయప్పునే

తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (2)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే

ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (3)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ జిల్లేడు కాయప్పునే

జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (4)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

మందార పువ్వోప్పునే గౌరమ్మ మందార కాయప్పునే

మందార పువ్వులో మందార కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే

గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే

గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ.. గన్నేరు కాయప్పునే

గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (6)

బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట ప్రతి వీధిలోనూ మారుమ్రోగుతూనే ఉంటుంది.

2. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1)

రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే

రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (2)

వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే

వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (3)

బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే

భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (4)

పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే

పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (5)

ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే

ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (6)

ఈ వాడ వాడవాడల్లోన బతుకుమ్మ సమయంలో మార్మోమ్రోగుతుంది.

3. రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో (1)

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో

ముందుగా నినుదల్తు ఉయ్యాలో

అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో (3)

భక్తితో నినుదల్తు ఉయ్యాలో

గణపతయ్య నిన్ను ఉయ్యాలో (4)

భవిత మనకు జెప్పు ఉయ్యాలో (6)

కోటి దండాలురా ఉయ్యాలో (7)

కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో

కొంరెల్లి మల్లన్న ఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో (8)

ఎములాడ రాజన్న ఉయ్యాలో (9)

ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో

ఐకమత్య మియ్యి ఉయ్యాలో (10)

బంగారు బతుకమ్మ ఉయ్యాలో (11)

Bathukamma Songs PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Bathukamma Songs PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Bathukamma Songs is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version